హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభ అట్టహాసంగా జరుగుతోంది. రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. సభ ప్రధాన వేదికకు ఎదురుగా రెండు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యుల కోసం ఒక వేదిక కేటాయించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడిన రాహుల్… వారిని పరామర్శించారు. కన్నీరు తుడిచి… అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాహుల్ వెంట ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రైతుల సమస్యల్ని వివరించారు.
హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభ లైవ్..
