Site icon Polytricks.in

జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే -రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తన జీవితభాగస్వామి ఎలా ఉండాలి అనే విషయంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్  కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. కుటుంబ సభ్యుల ఆత్మీయతను వివరిస్తూ ఇందిరా గాంధీ గురించి చెప్పుకొచ్చారు. నాన్నమ్మ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు.

మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు రాహుల్ గాంధీ. నాన్నమ్మ ఇందిరా గాంధీ తరహ లక్షణాలు ఉండాలని పేర్కొన్నారు. ఇందిరా , సోనియా గాంధీ లక్షలు కలగలిసి ఉంటె మరీ మంచిదని వ్యాఖ్యానించారు.

తన ఇష్టాలను కూడా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టారు రాహుల్ గాంధీ. కార్లపై తనకు ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదని తెలిపారు. తనకు సొంత కారు కూడా లేదని, ఇంట్లో ఒక కారు ఉన్నా అది సోనియా గాంధీదని వివరించారు. కార్లంటే మక్కువ లేకపోయినా వాటిలో తలెత్తే సమస్యలను ఏంటో తెలుసునన్నారు. కార్లను రిపేర్ చేస్తానన్నారు. గాలిలో, నీటిలో, నేల మీద ఎక్కడైనా వేగంగా దూసుకెళ్ళడమంటే ఇష్టమన్నారు.

తనను పప్పు అంటూ చేసే విమర్శలపై రాహుల్ గాంధీ ఈ ఇంటర్వ్యూలో స్పందించారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా, హేళన చేసినా తనను ద్వేషించనని, ప్రేమించడమే తనకు తెలిసిన పని అంటూ చెప్పుకొచ్చారు. తనను హేళన చేసే పేర్లతో పిలిచినా పట్టించుకోనని స్పష్టం చేశారు.

Exit mobile version