తెలంగాణ లోని ప్రజాస్వామ్యం పైన అద్భుతమైన పద్యం

ప్రజాస్వామ్యమా మేలుకో !

మాటలతో గారడీ చెస్తూ
మనుషులను మభ్య పెడుతూ
మంచి జరిగితే మేమె చేశానని
మంచి జరగకపోతే గత ప్రభుత్వాల పాపమని
వైఫల్యాలను కప్పి పుచ్చుతూ
వాస్తవాలని బొంద పెడుతు
ప్రజాస్వామ్య రాజ్యంలో రాచరికపాలన చెస్తూ
మంత్రులను గొర్రెలకన్నా హీనంగా పెంచుతూ
ప్రజాప్రతినిధులను సంస్థాన తాబేదార్లుగా
సంస్థాన ఆస్థాన భజనపరులుగా చైర్మన్లు

రాష్ట్రం చుట్టూ తిరగాల్సిన నాయకులూ సంస్థానము చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే
ప్రజా సమస్యలు గాలికొదిలేసి
వ్యక్తిగత ప్రయోజనాలే ద్యేయంగా

నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి
రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసి
మిగులు రాష్ట్రాన్ని తెగులు రాష్ట్రం గా తీర్చిదిద్ది

ఆత్మగౌరవ పొరాటం అని నిన్ను అంచలంచెలుగా ఎదగనిస్తే
ఆ ఆత్మగౌరవాన్ని తన సంస్థానంలో బొంద పెట్టి
ఇచ్చిన హామీలన్నీ మూటకట్టి మూసీలో పడేసి

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అని చెప్పిన అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసావ్ .

మేలుకో ప్రజాస్వామ్యమా మేలుకో !!

State tune for part 2

Written by
Srinivas Dasari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *