పట్టభద్రల ఓటు నమోదు గడువు పెంచాలి: తెలంగాణ హైకోర్టు
పట్టభద్రుల ఓటు నమోదు కోసం గడువు పెంచాలని ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పట్టభద్రుల ఓటు నమోదు గడువు పొడిగించాలన్న పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పొడిగించాలంటూ ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో జారీ చేసిన ఓటు నమోదు నవంబర్ 6న ముగుస్తుందని హేకోర్టుకు ఈసీ తెలిపింది.

డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మరలా ప్రెష్ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. గతంలో ఫామ్ 18 ద్వారా ఓటు నమోదు చేసుకున్న వారికి ఫామ్ 6,7 ద్వారా ఓట్లు నమోదు చేసుకునే అవకాశం కలిపిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు నమోదు చేసుకోని వారు అవసరమైతే డిసెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. హై కోర్టు ఆదేశాల మేరకు పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచుతామని ఈసీ పేర్కొంది. ఈసీ వివరణ నమోదు చేసి పిటిషన్ పై విచారణను హైకోర్టు ముగించింది.
ఇదే పిటిషన్ పై గురువారం రోజు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 లోగా ధరఖాస్తులు స్వీకరించాలని చట్టంలో ఉందని హైకోర్టుకు ఈసీ తెలియజేసింది. వరదలు వచ్చి ప్రజల ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చకూడదా? అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.