బీబీ పాటిల్ కు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేఖత?

గులాబీ బాస్ ఒకసారి అవకాశమిచ్చాడంటేనే గొప్ప. అలాంటిది ఎంత వ్యతిరేఖత ఎదురైనా జహీరాబాద్ పార్లమెంటుకు బీబీ పాటిల్ పేరును ఖరారు చేసాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. 2014 ఎన్నికల్లో తెరాస గుర్తింపుతో గెలిచిన పాటిల్ కు అప్పటి తెరాస ముఖ్య నాయకులు అండగా నిలబడి గెలిపించుకున్నారు. స్థానికుడు కాకపోయినా, తెలుగు రాకపోయినా, తెలంగాణా ఉద్యమ నేపథ్యం అసలు లేకపోయినా పార్టీ కార్యకర్తలు, నాయకుల సమిష్టి కృషికి కేసీయార్ చరిష్మా తోడవడంతో కొత్త ముఖమైనా ప్రజలు ఓట్లేసి గెలిపించారు.

కానీ, బీబీ పాటిల్ పార్లమెంటులో అడుగుపెట్టాక కాని స్థానిక నాయకులకు ఆయన విషయం అర్ధం కాలేదు. ఒక ప్రజాప్రతినిధికి ప్రజల్లో వ్యతిరేఖత రావడానికి కొంత కాలం పడుతుంది. కానీ బీబీ పాటిల్ విషయంలో మాత్రం చాలా తొందరగానే వచ్చింది. ఎంతో ఆర్భాటంగా దత్తత తీసుకున్న గ్రామాలను కూడా కనీసం కన్నెత్తి చూడలేదు. ఇంక మిగిలిన ప్రాంతాల గురించి చెప్పనవసరం లేదు. పార్టీ నాయకులకే అందుబాటులో ఉండకుండా వ్యాపారాల మీదనే ధ్యాస పెట్టి మహారాష్ట్రలోనే ఎక్కువ కాలం గడిపారు. ఇక సమాన్య జనాల సంగతి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఐదేళ్ళుగా జహీరాబాద్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. కనీసం ఎంపీ ల్యాడ్స్ నిధులు 20 కోట్లను కూడా ఖర్చు చేయడంలో విఫలమయ్యారు. 5 కోట్లను మాత్రమే ఖర్చు చేసి ప్రజా సమస్యలను గాలికొదిలేయడం కూడా పార్టీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. ఎన్నోసార్లు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాయకులను కూడా మీటింగులకు పిలవకుండా దూరం పెట్టాడనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తెలుగు రాకపోవడం బీబీ పాటిల్ కు పెద్ద మైనస్ గా మారింది.

గత కొంతకాలం నుంచి జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థిత్వంపై స్థానిక నాయకులు పార్టీ నాయకత్వానికి పలు చూచనలు చేసారు. బీబీ పాటిల్ ను మార్చాలని ఎంత పట్టు పట్టినా కేసీయార్ మరోసారి పాటిల్ పై భరోసా ఉంచడంతో నాయకుల్లో ఉత్సాహం కొరవడింది. జహీరాబాద్ లోని అన్ని అసెంబ్లీ సిగ్మెంటుల్లో తెరాస ఎమ్మెల్యేలే ఉన్నా కూడా ప్రచారంలో మాత్రం బాగా వెనుకబడిపోయారు. నాయకులు ఏదో మొక్కుబడీగా పాటిల్ కు మద్ధతిస్తున్నా అది కేవలం ప్రచారం వరకే ఉంటుంది. తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పాటిల్ కూడా వీరందరిని సమన్వయం చేయడంలో, కలుపుకుపోవడంలో విఫలమవుతున్నాడు. పైగా సొంత కమ్యూనిటీ నుంచి ఎదురుదెబ్బలు తాకడం కూడా మైనస్ గా మరింది.

ఇన్ని ప్రతికూలతల మధ్య టికెట్ సంపాదించుకున్న బీబీ పాటిల్, కేసీయార్ నమ్మకాన్ని నిలబెడుతాడన్న గ్యారెంటీ లేదని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారట. మరి వచ్చే ఎన్నికల్లో ఇంత వ్యతిరేఖతను ఎలా తట్టుకోగలడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *