తెలంగాణలో గెలుపెవరిది??

1.ఖమ్మం — ఇక్కడ ద్విముఖ పోరు జరుగుతుంది.టి ఆర్ ఎస్ నుండి నామా నాగేశ్వర రావు,కాంగ్రెస్ నుండి రేణుకా చౌదరీ కి పోటీపడుతున్నరు.నామా గారు 50 కోట్లు పార్టీ కి ఇచ్చిన్రని వినికిడి.ఏం ఎల్ ఏ లు పూర్తిగ సహకరిస్తున్రు .టి డి పి కార్యకర్తలు కాంగ్రెస్ కు పూర్తి మద్ధతివ్వడం రేణుకా కు ప్లస్.పొంగులేటి శ్రీనివస్ రెడ్డి వర్గం రేణుకు మద్ధతు తెలుపుతున్నరు. కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉన్నా .. నామా డబ్బులను రేణుకా తట్టుకోగలదా అనేదే అందరి ఆలోచన .. ఇప్పటికైతే ఇక్కడ కాంగ్రెస్కే ప్లస్ గ ఉన్నది.

2. మహబూబాబాద్ — గిరిజన నియోజకవర్గమైన మహబూబాబాద్ లో టి ఆర్ ఎస్ బలంగా ఉన్నా .. మాలోతు కవితకు అంత మంచి పేరు లేదు.స్థానిక ఎం ఎల్ ఏ శంకర్ నాయక్ పూర్తిగ సహకరించట్లేదు.కాంగ్రెస్ నుండి బలరాం నాయక్ కాకుండ సీతక్క అయ్యుంటే తప్పక గెలుస్తుండే అని టాక్ . ఇప్పటికైతే ఇక్కడ టి ఆర్ ఎస్ కే ప్లస్.

3.వరంగల్ — ప్రస్తుత టి ఆర్ ఎస్ ఎం పి మీద వ్యతిరేకత లేనప్పటికి .. ఆయన మాట్లాడంగ మేము ఇనలే అని టాక్. కొండా దంపతులు కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించి సత్తా చాటాలని అనుకున్నప్పటికి సంస్థాగతంగ టి ఆర్ ఎస్ బలంగా ఉండటంతో ఇక్కడ టి ఆర్ ఎస్ కే ప్లస్.

4.కరీం నగర్— ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతున్నది. ఏం ఎల్ సి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ఊపుమీదున్నా.. భ జ పా అభ్యర్ధి బండి సంజయ్ కి మంచి పేరు ఉండటం,మున్నూరు కాపు కులస్థుడు కావటం ఎడ్వాంటేజ్.కరీం నగర్ అసెంబ్లీ లో తప్ప బయట ఏ నియోజకవర్గంలో చెప్పుకునే స్థాయిలో వోట్లు లేకపోవడం మైనస్.ఇక టి ఆర్ ఎస్ కి ఈ సీట్ పెట్టని కోట. వెలమ సామజిక వర్గం బలంగా ఉండటం టి ఆర్ ఎస్ కి అదనపు బలం… మొత్తానికైతే .. టి ఆర్ ఎస్ కే ప్లస్.

5.అదిలాబాద్ — గత ఎన్నికల్లో టి ఆర్ ఎస్ స్వీప్ చేసినా .. కాంగ్రెస్ పక్కాగా గెలిచే మొదటి స్థానం అదిలాబాద్ అని చెప్పవచ్చు…ఇక్కడ పార్టీ కన్న అభ్యర్ధి కీలకం అవుతున్నరు.ఆర్ధిక బలం .. బందు వర్గం రమేశ్ రాథోడ్ కి ఎడ్వాంటేజ్ … కాంగ్రెస్కే ప్లస్

6.పెద్దపల్లి — స్థానికేతరుడు కావటం కాంగ్రెస్ కి మినస్. టి ఆర్ ఎస్ పక్కా.

7. నిజామాబాద్ – ఇక్కడ టి ఆర్ ఎస్ బలంగా ఉన్నా,జాతీయ ఎన్నికల ప్రభావం ఉండబోతుంది.రైతుల నామినేషన్ కాంగ్రెస్ పార్టీ అని టి ఆర్ ఎస్ గట్టిగ తీసుకపొతే టి ఆర్ ఎస్ విజయం సాధించినట్లే.భ జ పా బలంగా కనపడుతున్నప్పటికి, 17 శాతం ఉన్న ముస్లిం వోట్లు పడకపోవటంతో భ జ పా గెలుపు కష్టం . ఇప్పటికైతే టి ఆర్ ఎస్ కే ప్లస్.

8. జహీరాబాద్ — గత ఎన్నికల్లో ఎవరో తెల్వని మరాఠీ పాటిల్ ని టి ఆర్ ఎస్ గెలుపియ్యటం…ఈ సారి కూడా బాగా పైసలున్నయని తనకే టికెట్ ఇవ్వటం డిసెడ్వాంటేజ్.కాంగ్రెస్ అభ్యర్ధి స్థానికుడు కావటం .. విద్యావంతుడు కావటం కాంగ్రెస్ కి ప్లస్.

9. మెదక్— టి ఆర్ ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు పక్కా.పోటీ టి ఆర్ ఎస్ భ జ పా మధ్యనే ఉండబోతుంది.

10. మల్కాజ్గిరి— పోటీ టి ఆర్ ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుంది. టి ఆర్ ఎస్ అభ్యర్ధి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు తెల్వకపోవటం మైనస్. కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి మీద ఉన్న సానుభూతి ఎడ్వాంటేజ్ కాబోతుంది. కాంగ్రెస్ గెలుపు పక్కా.

11.చేవెళ్ల — స్థానికేతరుడు కావటం టి ఆర్ ఎస్ కి నెగటివ్. మంచి పేరు,విద్యావంతులు ఎక్కువ మంది కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి సపోర్ట్ చెయ్యటం కాంగ్రెస్ కి ప్లస్. భ జ పా పోటీలో లేనట్లే .. అభ్యర్ధి ఎవరో కూడ ప్రజలకు తెలియదు.కాంగ్రెస్ కి ప్లస్.

12. సికిందరాబాద్ – ఇక్కడ త్రిముఖ పోరు జరుగుతున్నప్పటికి, భ జ పా కు ఉన్న రాష్ట్ర కేడర్ అంతా ఇక్కడే కాన్సెంట్రేట్ చేస్తుంది. భ జ పా అభ్యర్ధి కిషన్ రెడ్డి కి ఉన్న పేరు ఎడ్వాంటేజ్ కాబోతుంది. భ జ పా గెలుపు పక్కా.

13. హైద్రాబాద్ — విశ్లేషణ అనవసరం.ఎం ఐ ఎం గెలుపు పక్కా.

14. మహబూబ్ నగర్ — టి ఆర్ ఎస్ అభ్యర్ధి ఎవరో జనానికి తెలియదు అయినప్పటికి ఎం ఎల్ ఏ ల అండ పుష్కలంగ ఉంది.డి కె అరుణ గారికి మంచి పేరున్నప్పటికి పార్టీ చాలా వీక్ గ ఉంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో భ జ పా కు మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలో 62,859 వోట్లు రాగా ఒక్క కొడంగళ్ లొనే కాంగ్రెస్ కి 71,435 వోట్లు వచ్చినయి. పోటీ టి అర్ ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుంది .. కాంగ్రెస్ కే ప్లస్.

15. నాగర్ కర్నూల్ — టి ఆర్ ఎస్ గెలుపు పక్కా.

16. నల్లగొండ— టి ఆర్ ఎస్ అభ్యర్ధి కొత్త కావటం.. హూజూర్ నగర్ లో ఉత్తం ఎం పి గ గెలుస్తే బై ఎలెక్షన్లో టి ఆర్ ఎస్ అభ్యర్ధిని గెలుపు పక్కా అన్న అలోచనతో టి అర్ ఎస్ క్యాడర్ అంతా కాంగ్రెస్ కి సపోర్ట్ చెయ్యటంతో ఒక్క హూజూర్ నగర్ నియోజకవర్గంలోనే 50 వేలకు పై గా కాంగ్రెస్ కి మెజారిటీ వచ్చే సూచన .. కాంగ్రెస్ గెలుపు పక్కా

17. భువనగిరి — పోటీ గట్టిగ ఉన్నప్పటికి , కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతిష్టాత్మకంగ తీసుకోవటం ఆమె ఆలేరులో టి ఆర్ ఎస్ ఎం ఎల్ ఏ కాంగ్రెస్ కి లోపాయికారికంగ చెయ్యటం, కాంగ్రెస్ కి ప్లస్ .

టి ఆర్ ఎస్ — 7
కాంగ్రెస్ — 8
భజపా – 1
ఎం ఐ ఎం – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *