జహీరాబాద్ కు ఎలాంటి నాయకుడు కావాలి?
జహీరాబాద్.. ఎంత మంది నాయకులు వచ్చినా ఎన్ని పార్టీలు మారినా ఈ ప్రాంతం రూపురేఖలు మారలేదు. ఇక్కడి ప్రజల రాత మారలేదు. దానికి కారణాలేంటి?
ఏ నియోజకవర్గమైనా ఏ ఒక్కరి నాయకత్వంలోనైనా కాస్త అభివృద్ధి చెందుతుంది. కానీ జహీరాబాద్ విషయానికొస్తే అభివృద్ధి మాట పక్కనపెడితే కనీసం మౌళిక సదుపాయాలను కల్పించడంలో కూడా నాయకులు విఫలమవుతున్నారు. దీనికి కారణం ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసి వాటి పరిష్కారం దిశగా కృషి చేసే నాయకుడు కరువవడం.
ఇప్పటివరకు జహీరాబాద్ ఎంపీలు గా పనిచేసిన వారిలో ఎక్కువ శాతం స్థానికేతరులే కావడంతో అభివృద్ధి మీద ఎక్కువ శ్రద్ద పెట్టలేదు. ప్రస్తుత టీఆరెస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా పూణేకి చెందినవాడవడంతో జహీరాబాద్ పరిస్థితి మరింత దిగజారింది. బీబీ పాటిల్ తెలంగాణా ఉద్యమంలో కానీ, రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కానీ ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కనీసం ప్రజల్లో తిరిగినవారు కూడా కాదు. రాష్ట్రం ఏర్పడ్డాక అనూహ్యంగా టీఆరెస్ లో చేరి ఎంపీ టికెట్ సాధించి గెలుపొందారు. గెలిచిన తర్వాత కూడా తన వ్యాపారాల మీదనే ఎక్కువగా దృష్టి పెట్టిన బీబీ పాటిల్ పాలనను పక్కకు పెట్టాడు.తెలంగాణా ఏర్పడ్డాక అయినా పరిస్థితి మారుతుందని ఆశించిన ప్రజలకు బీబీ పాటిల్ రూపంలో మరోసారి భంగపడక తప్పలేదు. జహీరాబాద్ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించలేదు. ప్రజలు తమ కష్టాలను చెప్పుకుందామన్నా నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడంతో చాలా అసహనానికి గురయ్యారు.
కానీ ఇన్నాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ ను జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. మదన్ మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎర్రపహాడ్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివి, అమెరికాలో కంపెనీలు పెట్టే స్థాయికి ఎదిగారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీలకంగా అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. అధికారంలో లేకున్నా జాబ్ మేళాలు ఎన్నో నిర్వహించి వేల మందికి ఉపాధి కల్పించారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు.
మదన్ మోహన్ కు జహీరాబాద్ సమస్యల మీద మంచి అవగాహన ఉంది. వ్యవసాయ రంగంలో డిప్లొమా చేసి కూడా సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోవడం మాటలు కాదు. ఆయనకు రైతు కష్టాల మీద, వలస బ్రతుకుల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్ ఎంపీ అయ్యాక కూడా పూణేలో తన వ్యాపారాలు చూసుకుంటూ ప్రజలను పక్కనపెట్టారు. కానీ మదన్ మోహన్ అధికారంలో లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ వారి కోసం కష్టపడుతున్నాడు. జహీరాబాద్ స్థానికుడు కావడం, టెక్నాలజీ గురించి బాగా తెలిసినవాడవడం మదన్ మోహన్ బలాలు.
ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ బలమైన, నమ్మకమైన అభ్యర్థులనే బరిలోకి దించుతుంది. అందుకే జహీరాబాద్ పోటీలో మదన్ మోహన్ ను రంగంలోకి దింపింది. రాహుల్ గాంధీకి మదన్ మోహన్ చాలా సన్నిహితుడు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి జహీరాబాద్ ను అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశపడుతున్నారు.