N.G.రంగా గారి వర్ధంతి సదర్భంగా ఆయన గూర్చి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

ఈ రోజు N.G.రంగా గారి వర్ధంతి. వడ్డే శోభనాద్రీశ్వర రావ్ గారు తమ గురువు రంగా గురించి ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశారు.

ఈ సందర్భముగా రంగా గారి ఎన్నికల గురించి కొన్ని విషయాలు.

తెలుగు సినిమా రంగం నుండి ప్రత్యక్ష ఎన్నికలలో (లోక్ సభ) గెలిచిన మొదటి వారు జగ్గయ్య,1967లో కాంగ్రేస్ తరుపున ఒంగోలు లోక్ సభ స్థానం నుండి గెలిచారు. జగ్గయ్యగారికన్నాముందు మొత్తం బారతదేశంలో మరే నటుడు/నటురాలు లోక్ సభకు ఎన్నికయ్యారేమో పరిశీలించాలి.

రాజ్యసభకు ఎన్నికయిన తోలి నటుడు పృధ్విరాజ్ కపూర్, 1952లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.ఆంధ్రా నుంచి రావు గోపాల్ రావు రాజ్యసభకు ఎన్నికయిన తోలి నటుడు. 1986లో ఎన్టీఆర్ రావు గోపాల్ రావును రాజ్యసభకు ఎంపిక చేశారు. అంతకు ముందు 1984లో రావు గోపాలరావు MLC గా కూడా ఎన్నికయ్యారు.

జగ్గయ్యగారు All India Radioలో news reader గా పనిచేసేవారు. ఒకేసారి ఆయన చదవలసిన అధికార వార్తా పేపర్లతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఉన్న అనధికార వార్తా పేపర్ కూడా కలిసి రావటం అది జగయ్య గారు చదవటం జరిగింది. దీనితో ప్రభుత్వం జగ్గయ్యను ఉద్యోగం నుంచి తొలగించింది.

ఉద్యోగం పోయిన తరువాత జగ్గయ్యగారు తన “కంచు కంఠాన్ని” నమ్ముకొని సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆతరువాత రాజకీయాల్లోకి కూడా ప్రావేశించి 1962లో తెనాలి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రేసు తరుపున N.G.Ranga మీద పోటీ చేద్దాం అనుకున్నారు. రంగా గారి రైతు నాయకులు పార్లమెంటులో ఉండాలి అని నెహ్రు జగ్గయ్యను పోటీ చెయ్యొద్దని చెప్పారంట. రంగాగారు గెలవలేరు కమ్యునిష్టుల చేతిలో ఓడిపోతారని జగ్గయ్య చెప్పినా అయినా నెహ్రు పోటీవోద్దన్నారంట.జగ్గయ్య చెప్పినట్లే రంగా గారు కొల్లా వెంకయ్య(CPI) చేతిలో ఓడిపోయారు.

1967 ఎన్నికలలో తెనాలి లోక్ సభ స్థానం రద్దు కావటంతో జగ్గయ్య ఒంగోలు నుండి పోటీచేసి గెలిచారు.

1956లో చిత్తూరు నుంచి గెలిచిన(అప్పటి స్పీకర్ కూడా) అనంతశయనం అయ్యంగారు1962లో తిరిగి గెలిచి కొన్ని నెలలకే లోక్ సభకు రాజీనామ చేసి(ఆరోగ్య కారణాలతో) బీహారు గవర్నరుగా వెళ్లారు.అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో తెనాలి నుంచి ఓడిపోయున్న రంగా గారు స్వతంత్ర పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు.DMK కు మద్రాస్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో మద్దతు ఇచ్చినందుకు స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా రంగాగారికి చిత్తూరు ఉప ఎన్నికలలో డిఎంకె మద్దతు ఇవ్వటంతో ,రంగాగారు గెలిచారు.

1967లో రంగా Sitting Seat చిత్తూరు నుంచే లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన శిష్యుడు గౌతు లచ్చన్న ఆ ఎన్నికలలో “సోంపేట” నుంచి అసెంబ్లికి శ్రీకాకుళం నుంచి పార్లమెంటుకు గెలిచి వున్నారు.లచ్చన్న శ్రీకాకుళం MPకి రాజీనామ చేసి రంగాగారిని అక్కడి నుంఛి గెలిపించారు.ఇలా రెండుసార్లు సాధారణ ఎన్నికల తరువాత కొన్ని నెలల్లోనే ఉప ఎన్నికలలో గెలవటం ఒక రికార్డు.

1971లో శ్రీకాకుళం నుంచి ఓడిపోయినా తరువాత దాదాపు 2 దశాబ్దాలు కీలక కాంగ్రెస్ వ్యతిరేక నాయకుడిగా ఉన్న రంగా తిరిగి కాంగ్రెసులో చేరి ఎమర్జెన్సీ సమయంలో ఇందిరకు మద్దతు ఇచ్చారు.

రంగా 1977-1980 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున 1980,84,89 ఎన్నికల్లో గెలిచి 91 సంవత్సరాల వయస్సులో 1991 ఎన్నికల్లో టీడిపీ లాల్ జాన్ బాషా చేతిలో ఓడిపోయారు.

1952లో తొలిసారి రాజ్యసభకు ఎనికయినప్పటి నుంచి 1991 మధ్య కాలం లేవాలం 1971-1977 మధ్య మాత్రమే రంగా గారు పార్లమెంటులో సభ్యులు కాదు.రంగా గారిలా ఒకే రాష్ట్రంలో నాలుగు లోక్ సభ స్థానాల నుంచి గెలిచిన మరే ఇతర నాయకుడు లేరు.

1995 జూన్ 9న రంగా గారు చనిపోయారు. రంగా శిష్యుడిగా రాయపాటి సాంబశివరావు గుంటూరు నుంచి లోక్ సభ సభ్యుడిగా 1996, 1998, 2004, 2009లో గెలిచి 1999లో ఓడిపోయారు.

నాయకులను తయారు చేసారన్న అభిప్రాయంతో ఆయన శిష్యులు “నాయకుల” ను ఇంటి పేరులో చేర్చి గోగినేని రంగనాయకుల పేరును N.G.రంగా మార్చారు.

రంగా గారు బ్రిటన్లో(Oxford) చదువుకొని రాజకీయాలకు రావటం, వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టటం తదితర అంశాలు చిన్న వయస్సులోనే పెద్దనాయకుడికి చేశాయి. అప్పట్లో మంచి ఉపన్యాసాలను పార్టీలకు అతీతంగా వినటం కూడా రంగా లాంటి ఉపన్యాసకులు నాయకులుగా ఎదగటానికి ఉపయోగ పడింది. రంగా గారు సొంత ఊరు నిడుబ్రోలులో వ్యవసాయ శిక్షణా తరగతులు నిర్వహించేవారు. అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడ శిక్షణ పొందారు.

By Shiva Racharla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *