ప్రొఫెసర్ కోదండరాం – BA, MA, MPhil, PhD, TVV, TJAC, TJS

తెలంగాణ జేఏసీ చేర్మన్ గా
తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రో.కోదండరాం
వచ్చిన తెలంగాణ లో పదవులు ఇస్తామని ఆశ చూపిన ప్రో.జయశంకర్ కోరిక మేరకు అధికారం కోసం అర్రులు చాచకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలిచేందుకు తెలంగాణ జేఏసీ ద్వారా ప్రయత్నించారు.

nknunkown facts about Kodandaram

ఏ తెలంగాణ కోసం కోట్లాడమో
ఆ తెలంగాణ ఇంకా రాలేదని
అమరుల ఆశయాలకు వ్యతిరేకంగా పాలన కొనసాగుతుందని కోదండరాం ప్రభుత్వ వైఫల్యాలపై పోరు బాట పట్టారు.
ఆయనకున్న క్లిన్ ఇమేజ్ కి భయపడి TRS ప్రభుత్వం ఏ కార్యక్రమంలో పాల్గొన్న అక్రమ అరెస్టులు, నిర్బందాలతో ఆయన్ని వేధించారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం నిఖార్సయిన తెలంగాణ పార్టీ అవసరం ఉందని భావించిన కోదండరాం గారు తెలంగాణ జన సమితి పార్టీ ని ఏర్పాటు చేశారు.

పౌర హక్కుల నేతగా,
తెలంగాణ ఉద్యమం నాయకుడిగా ,
తెలంగాణ జన సమితి అధినేత గా ఉన్న ప్రో.కోదండరాం గారి గురించి చాల మందికి తెలియని విషయాలు. ఆయన జీవితంలో కీలక విషయాలు.

1.B.A- వరంగల్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి నుంచి.

2.M.A. పొలిటికల్ సైన్స్ హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి.

3.M. Phil. పొలిటికల్ సైన్స్.
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ నుంచి(Specialisation-
chinese studies)
JNU లో తెలుగు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ కి జరిగిన పరీక్షలో మొదటి స్థానం.

4.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి Changing power relations in Telangana అంశంపై పిహెచ్.డి.
HCU స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిగా ఎన్నిక.

5. ఉస్మానియా యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా ఆర్ట్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్, నిజాం కాలేజ్, సికింద్రాబాద్ పి.జి కాలేజ్ లలో పని చేశారు.

కోదండరాం గారు చేసిన కొన్ని సామాజిక కార్యక్రమాలు.

1.ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టిస్ కమిటీ(APCLC) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా మరియు హైదరాబాద్ జనరల్ సెక్రటరీ గా పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పని చేశారు.
2.ఆహార భద్రత చట్టం కేసు విషయంలో సుప్రీంకోర్టు కమిషనర్ కి సలహాదారు గా సేవలు అందించారు.
3.తెలంగాణ విద్య వంతుల వేదిక (TVV)రాష్ట్ర అధ్యక్షుడు గా పని చేశారు.
TVV ని ప్రో.జయశంకర్ గారు ఏర్పాటు చేశారు.

4.హ్యూమన్ రైట్స్ ఫోరమ్ స్టేట్ కమిటీ మెంబెర్.
5.రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేయపడ్డ రైతు సహాయ కమిటీ లో సభ్యుడు గా రైతు ఆత్మహత్యలకు గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు పై కూడా కీలక సూచనలు
అందజేశారు.
6.స్వేచ్ఛ మ్యాగజైన్ కి ఎడిటర్ గా పని చేశారు.

7.తెలంగాణ జాయింట్ ఏక్షన్ కమిటీ TJAC చైర్మన్ గా పని చేసి తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకెళ్ళడంలో, సబ్బండ వర్ణాలను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు.

ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది ఆదివాసీలను నిర్వాసితులుగా చేసే పోలవరం ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (PIL) వేశారు.
రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ని ఎండ కడుతూ హైకోర్టులో PIL వేశారు.

భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్నాం. కానీ కోట్లాది మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రంలో, అమరుల ఆశయాలకు భిన్నంగా నిరంకుశ పాలన కొనసాగుతున్నదని ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ జన సమితి పార్టీ ని ఏర్పాటు చేసి దాని అధ్యక్షులుగా ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *