సొషల్ మీడియా సైనికులకు తెడ్డు చూపించిన కాంగ్రెస్..!?

సమస్యల ప్రస్తావనలో, సర్కారు ప్రజావ్యతిరేఖ పాలనను ప్రశ్నించడంలో ముందున్న సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమయిందనే చెప్పాలి. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా సర్కారును ఎండగట్టి, స్కాములను బయటపెట్టి, బెదిరింపులను కూడా తట్టుకొని నిలిచిన సోషల్ మీడియా ఆక్టివిస్టులకు తీరా ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పెద్దలు మోకాలడ్డు పెట్టినట్టారని, ఇన్నిరోజులు అలుపెరుగకుడా పోరాటం చేసిన తమను నిరాశా నిస్పృహలకు లోను చేస్తున్నారని వాపోతున్నారు.

Telangana

అసలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మొదట గళమెత్తింది సోషల్ మీడియానే. మెయిన్ స్ట్రీం మీడుయా మొత్తం సర్కారు భజన కీర్తులు పాడుతుంటే, సోషల్ మీడియా మాత్రం దీనికి భిన్నంగా ప్రభుత్వం చేసే అక్రమాలను బయటపెట్టింది.. సాక్షాత్తూ సీఎం గారే బహిరంగంగా తన అసహనం వ్యక్తం చేయడం, ఆక్టివిస్టులను అరెస్టు చేయడం చూస్తేనే సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేసిందో మనకు అర్దమవుతుంది.. కేటీఆరే రంగంలోకి దిగి వందల మంది కార్యకర్తలతో మీటింగ్ పెట్టి జీతాలిచ్చి పోశించి సోషల్ మీడియా వ్యతిరేఖతను తిప్పికొట్టాలని చూసినా ఏమి చేయలేకపోయారు. అదిరించినా బెదిరించినా తమ గళాలకు, కలాలకు ఇంకాస్త పదును పెంచారే కాని బెదరలేదు.

కాంగ్రెస్ కు మైలేజీ తెచ్చిన సోషల్ మీడియా ఆక్టివిస్టులను మాత్రం పూర్తిగా విస్మరించి ఇప్పుడు మాత్రం ప్రచారం కోసం ఢిల్లీ కంపెనీలకు, కనీసం తెలుగు రానివాళ్ళకు, ఇక్కడ రాజకీయాల పట్ల అవగాహన లేనివాళ్ళకు కోట్లకు కోట్లు కాంట్రాక్టులివ్వడంతో ఇన్ని రోజులు గళమెత్తిన తమ గొంతులో రాయి పడ్డట్టయిందని బాధపడుతున్నారు. ఏఐసీసీ కి చెందిన వార్ రూంలోనే దాదాపు 100 మంది బయటి రాష్ట్ట్రాల వ్యక్తులు పని చేస్తున్నారని, వారికి ఇక్కడి సమస్యల పట్ల కనీస అవగాహన కుడా లేదని ఇలాంటి వ్యక్తులను నమ్మితే ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరో విషయం ఏమిటంటే ఏఐసీసీ వార్ రూంలో , కేసీయార్ కుటుంబంలో ఒకరికి దగ్గరగా పని చేసిన వ్యక్తికి ఒక పెద్ద కాంట్రాక్టు ఇవ్వడంతో సోషల్ మీడియా కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. దొంగ చేతికే తాళాలిచ్చిన చందంగా, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే భాద్యతను టీఆరెస్ కనుసన్నల్లో నడిచే వ్యక్తికి అప్పగించడంపై మండిపడుతున్నారు. ఇదంతా కొందరు బడా నేతల కుట్ర అని, వారు కెసీయార్ కు అమ్ముడుపోయారని, కావాలని ప్రజ వ్యతిరేఖ గళాలకు వేదికైన సోషల్ మీడియాను నిర్వీర్యం చేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునే చర్యల్లో భాగమేనని రగిలిపోతున్నారు. ఇన్నాళ్ళు మంచి చెడు ఆలోచించకుండా దూకుడుగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలను కాంగ్రెస్ ఈ తరుణంలో ఉపయోగించుకోకపోవడం పెద్ద దెబ్బే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *