జ్యోత్స్న ఆరోపణలన్నీ అవాస్తవం : టీజేఏస్ మహిళ నాయకురాళ్లు

✍ తిరునగిరి జ్యోత్స్న టీజేఏస్ పార్టీపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం అని టీజేఏస్ రాష్ట్ర మహిళా నాయకురాళ్లు రాగులపల్లి లక్ష్మీ, అనంత లక్ష్మీ, మమత, ప్రసన్న, శాంతమ్మ, స్రవంతి, విజయ రాణి, గీతాంజలి తదితరులు పేర్కొన్నారు.

TJS Mahila leaders

✍ జ్యోత్స్న పార్టీ ఆవిర్భాం తర్వాత టీజేఏస్ లో చేరారు. చేరినప్పటి నుండి పార్టీ ఇచ్చిన టాస్క్ కోసం కాకుండా తన వ్యక్తిగత మైలేజ్ కోసం పని చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంపై అనేక సార్లు మహిళా విభాగం సమీక్షల్లో ప్రశ్నించినా తన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఆమె పాటించడం లేదు.

✍ మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ పై చేసిన ఆరోపణలు‌ పూర్తిగా అవాస్తవం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి, ఉద్యమానికి అనేక జాతీయ నాయకుల మద్దతు కూడగట్టిన వ్యక్తిపై ఇలాంటి విమర్శలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం.

✍ టీజేఏస్ పార్టీలో టికెట్ల వ్యాపారం నడుస్తుందనేది పూర్తిగా అసత్యం. ఇప్పటి వరకు పార్టీ కొన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జులను మాత్రమే ప్రకటించింది కానీ.. MLAఅభ్యర్థులుగా ఎవరినీ ప్రకటించలేదు. జ్యోత్స్న తనకు అంబర్ పేట్ టికెట్ ఇవ్వలేదని చెప్పడం తప్పు.

✍ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం నిరంతం పనిచేస్తున్న అసలు సిసలైన పార్టీ టీజేఏస్. ఉద్యమాన్ని నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో నడిపి తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన‌ కోదండరాం గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మహిళలుగా మేము గర్వపడుతున్నాం.

✍ టీజేఏస్ పార్టీలో మహిళలకు సరియైన గౌరవం, ప్రాతినిధ్యం ఉంది. భవిష్యత్తులో ఇంకా మహిళలకు పార్టీ మంచి అవకాశాలు కల్పిస్తుందని మేము నమ్ముతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *