కెసిఆర్ ప్రభుత్వ కొత్త రెవెన్యూ చట్టం ముఖ్యాంశాలు

వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు ముటేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే హక్కుల రికార్డ్ పూర్తి చేసి కొన్నవారికి వెంటనే బదిలీ చేయాలి.

ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి.

మోసపురితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు  పాస్ పుస్తకాన్ని జారీ చేస్టే రద్దు చేసి అధికారం కలెక్టర్

జారీ చేసిన చేసిన తహశీల్దార్ పై బర్తరఫ్ క్రిమినల్ కేసులు- తిరిగి భూములు స్వాధీనం.

కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం-ప్రభుత్వ అధికారి పై ఎటువంటి దావా వెయ్యారదు.

ఇప్పటి వరకు ఎటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం తహశీల్దార్ కు ఉంది.

డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి.

రుణాల మంజూరు కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకు ల్లో పెట్టుకోరాదు.

ఈ చట్టం సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది.

ఈ బిల్లు చట్టరూపం దాల్చగానే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 రద్దు అవుతుంది.

రికార్డులను అక్రమంగా దిద్దడం- మోసపూర్తిత ఉత్తర్వులు జారీ చేస్తే అధికారులు- ఉద్యోగుల పై క్రిమినల్ చర్యలు- సర్వీస్ నుంచి తొలగింపు బర్తరఫ్ చేస్తారు.

1971 యాక్ట్ రద్దు అయిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్- కేసులన్ని కొత్తగా ఏర్పాటు చేసే ప్రత్యేక ట్రిబ్యునల్ కు బదిలీ.

విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఫైనల్.

కొత్త చట్టం ఏర్పాటు అయిన తరువాత రూల్స్ రూపొందించాలి.

రికార్డుల డిజాతలైజేషన్ కి చట్ట బద్ధత.

విఆర్వో పదవుల రద్దు బిల్లు ముఖ్యాంశాలు

భూ రికార్డులను ఆధునికరించి డిజిలైజేషన్ చేసిన నేపథ్యంలో విఆర్వో వ్యవస్థ అవసరం లేదని భావించి విఆర్వో పోస్టులను రద్దు చేసాము.

విఆర్వో పోస్టులను రద్దు చేసిన నేపథ్యంలో ప్రతి ఉద్యోగిని ప్రభుత్వ శాఖలోని ఏదైనా సమాన స్థాయి కలిగిన ఉద్యోగానికి బదిలీ చేసుకునే అధికారం కల్పించాము.

ఎవరైనా ఇతర శాఖల బదిలీకి విముఖత చేస్తే విఅరెస్ లేదా స్వచ్చంద పదవి విరమణ కు అవకాశం కల్పించేలా చట్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *