టీఆర్ఎస్ కు ఓట‌మి త‌ప్ప‌దు. తాజా కేసీఆర్ స‌ర్వేలో వ‌చ్చిందిదే. అందుకే కేసీఆర్ వేధాంత ధోర‌ణి?

కేసీఆర్ గ‌త నాలుగైదు రోజులుగా స‌భ‌ల్లో… తాజా స‌ర్వే, తాజా స‌ర్వే వ‌చ్చింది. అందులో చాలా అంశాలున్నాయి, సిద్దిపేట‌లో హ‌రీష్ గెలుస్తాడు అంటూ చెప్పుకొచ్చినా, ఓవ‌రాల్ స‌ర్వేలో ఏముంది, ఎందుకు కేసీఆర్ వేధాంత దోర‌ణిలో, రెచ్చ‌గొట్టే దోర‌ణిలో మాట్లాడుతున్నారు, ఎంటా క‌ధా???

TRS Party Elections
కాంగ్రెస్ వాళ్ల‌ను కేసీఆర్ విమ‌ర్శించ‌టం కొత్త కాదు. టీడీపీ వాళ్ల‌ను తిట్ట‌డం కూడా కొత్త కాదు. టీఆరెఎస్ అబ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కేసీఆర్ కోరుతూనే ఓ కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. నిజంగా ఇలా కేసీఆర్ అంటార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కేసీఆర్ తాజాగా ఖానాపూర్ స‌భ‌లో… మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను హెచ్చరించారు.

టీఆర్ఎస్ ఓడిపోతే… వ‌చ్చే న‌ష్టం ఏమీలేదు. నాకు పెద్ద ఇబ్బంది కూడా ఏమీ ఉండ‌దు. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా… లేదంటే వ్య‌వ‌సాయం చేసుకుంటా. తెలంగాణ‌కు అంటే… మీకే ఇబ్బంది త‌ప్పా, మాకు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే… మీకే న‌ష్టం అంటూ చెప్పుకొచ్చారు.

అయితే, దీనిపై పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఇన్నాళ్లు లేనిది… కేసీఆర్ ఎందుకు ఈ మాట‌లు మాట్లాడారు, తాజాగా స‌ర్వే చేయించిన అని చెబుతున్న స‌ర్వేలో…. ఇదే తేలిందా అని అనుమానిస్తున్నారు. నిజంగా 100 సీట్లు గెలిచే అవ‌కాశం ఉంటే, ఎందుకు ఇంట్లో ప‌డుకొని రెస్ట్ తీసుకుంటా, వ్య‌వ‌సాయం చేసుకుంటా అని కొత్త మాట‌లు మాట్లాడుతున్నారు అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *