బెట్టింగ్ మాఫియా, పాస్ పోర్ట్ బ్రోకర్ ఎమ్మెల్యే కావాలా… ప్ర‌జ‌ల మ‌నిషా– బోధ‌న్ లో రేవంత్

ప్రజల బాధలు తెలిసిన సుదర్శన్ రెడ్డి ల కావాలా లేకపోతే క్రికెట్ బెట్టింగ్, పాస్‌పోర్టు బ్రోకర్ లాంటి ఎమ్మెల్యే కావాలా అని బోధన్ నియోజకవర్గ ప్రజలకు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తు దారి మధ్యలో నవీపేట్ బస్టాండ్ వద్ద ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.

Telangana Elections

సుదర్శన్ రెడ్డికి మంచి పేరుందని, అధికారుల వద్దకు వెళ్లి ఎవరైనా ఆయన పేరు చెబితే కనీస మర్యాద ఇచ్చేవారన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే పాస్‌పోర్టు బ్రోకర్, క్రికెట్ బెట్టింగ్, దుబాయ్‌లో ఉండేటేడు, జైళ్లో ఉండేటోడు కాదని పరోక్షంగా బోధన్ ఎమ్మెల్యే షకిల్ గురించి ప్రస్తావించారు. ప్రజలు విచక్షణతో ఆలోచించాలని తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ మీ ముందుకు వచ్చిందని అన్నారు. కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొడితే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్న, నిజాంసాగర్ నీళ్లు రావాలన్నా, చెరుకు రైతుల ఆత్మగౌరవం పెరగాలన్న అది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.

తెలంగాణ యువత 60 రోజులు కాంగ్రెస్ జెండాను మోయండి 60 నెలలు తెలంగాణ సమాజం కోసం కష్టపడి పనిచేసే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. అందరి జీవితాలను బాగుచేసుకోవాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. సోనియా గాంధీకి ప్రజలపై ఉన్న నమ్మకం, ధైర్యంతో ఆనాడు తెలంగాణ ఇచ్చారన్నారు. సోనియాకు మనపై మంచి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తాగుబోతు చేతిలో ఓడిపోయిందన్నారు. ఎప్పుడు లేస్తడో, ఎప్పుడు వస్తడో ఎవరికి తెలియదని కేసీఆర్ ఉద్దేశించి అన్నారు. రెండేస్తే లేసెటోడు, నాలుగేస్తే కూర్చునేటోడు, ఆరేస్తే మాట్లాడేటోడు తెలంగాణ పితామహుడని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఎంపీ కవితకు చేతకాక తండ్రిని తీసుకొచ్చి నిజామామాద్‌లో సభ నిర్వహిచారు. సభలో కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఏమైనా మాట్లాడాడా అని ప్రజలను ప్రశ్నించడంతో వారు లేదని సమాధానం ఇచ్చారు.

నాలుగున్నరేళ్లు అధికరంలో ఉన్నప్పుడు ఏమీ చేయనోడు మళ్లి అధికారం ఇస్తే చేస్తాడా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యని కేసీఆర్ ఓ సన్యాసి అయితే ఇక్కడి ఎమ్మెల్యే చవట అన్నారు. ఈ ఎమ్మెల్యే బెట్టింగ్‌లు, అక్రమ ఇసుక వ్యాపారంలో సీఎం కుతూరనో, మన ప్రాంత ఆడబిడ్డఅనో ప్రచారం చేసుకుని ఓట్లు అడిగితే నమ్మవద్దని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కనీసం 20 వేలు కూడా భర్తీ చేయలేని కేసీఆర్‌కు ఓట్లు వేస్తారా అన్నారు.

కేసీఆర్‌ను ప్రజలు ఉపేక్షించవద్దని, ఆయన్ను మరోసారి అధికారంలోకి వస్తే తీవ్ర కష్టాలు వస్తాయని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుదని తెలిపారు. రైతులకు పాస్ పుస్తకాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల ఇంటికే పాస్ పుస్తకాలను పంపిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *