నల్లగొండ హత్యల వెనుక రాజకీయం..!

నల్గొండ జిల్లా వివాదాలకు, హత్యలకు, ప్రమాదాలకు ఈ మధ్య కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతుంది.
ఎప్పుడు చూసినా ఏదో ఒక అంశంతో వార్తాల్లో నిలుస్తుంది. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో
జరిగిన ప్రేమ హత్య ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తన కూతుర్ని ప్రేమించి పెళ్లి
చేసుకున్నాడని కక్షతో ప్రణయ్ అనే యువకుడ్ని అమ్మాయి తండ్రి రియల్టర్ మారుతీరావు
దారుణంగా హత్య చేయించాడు. గతంలో మారుతీరావు కిడ్నాప్‌కు ప్లాన్ వేసిన ముఠాకే… అల్లుడిని
చంపే పని అప్పజెప్పాడు. రూ. 20 లక్షలు సూపారి ఇచ్చిమరి హత్య చేయించాడు.

pranay amrutha murder case

అయితే ప్రణయ్ హత్య కేసులో కొత్త కోణం తెరపైకి వచ్చింది. ప్రణయ్ హత్య వెనుక కొంతమంది పొలిటికల్ లీడర్ల హ్యాండ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రణయ్ భార్య అమృత ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హప్తముందని అమృత తెలిపింది. ప్రణయ్‌ను తనను రమ్మని వీరేశం పిలిచిడాని… బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో వీరేశం పేరు బయటకురావడంతో వెళ్లేందుకు భయపడ్డామని చెప్పింది. ప్రణయ్ తండ్రిపై కేతేపల్లి పోలీసులతో మాట్లాడి వీరేశం అక్రమ కేసు పెట్టించాడంది. తన తండ్రి మారుతీరావు రెండుసార్లు వీరేశంను కలిశాడని… బీహార్ నుంచి గ్యాంగ్‌ను పిలిపించి వీరేశమే ప్రణయ్‌ను హత్య చేయించాడని మీడియా ఎదుట అమ‌ృత చెప్పుకొచ్చింది.

మరోవైపు పోలీసులు కూడా ప్రణయ్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతని ఫ్యామిలీని వేధిస్తున్నట్లు
కుటుంబసభ్యులు చెబుతున్నారు. తన కొడుకును బలి తీసుకున్నారని వాపోతున్నారు. తమపై
అన్యాయంగా కేసులు పెట్టారని… ఐజీకి ఫిర్యాదు చేస్తే ఆ కేసులు కొట్టివేశారని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *