టీఆర్ఎస్ కు కోలుకోని షాక్, పార్టీ మారనున్న ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి. ?
టీఆర్ఎస్ పార్టీకి త్వరలో తాకబోయే షాక్ ఇదేనా… అంటే అవుననే అంటున్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనతో పాటు వారు కూడా పార్టీ మారే అవకాశం ఉందని, వారిద్దరూ పేరుకే పార్లమెంటరీ నేతలని…. వారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బాంబు పేల్చారు.
తాను పార్టీలో చేరేముందే… ఒకరికి 6 కోట్లు, మరో నేతకు 2 కోట్లు ఇవ్వాలని పార్టీ నేతలు చెప్పటంతో ఇచ్చానని, తాను గెలిచేదాకా కేసీఆర్ కు గెలుస్తానన్న నమ్మకం లేదని మరో షాకింగ్ న్యూస్ చెప్పారు ఎంపీ కొండా.
తనతో పాటు చాలా మంది పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారంతా బయటకు వస్తారంటూ జోస్యం చెప్పారు. తనను ఎంపీగా కూడా చూడలేదని, తన డ్రెస్ పైనా కేసీఆర్ కామెంట్స్ చేసేవారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.
తనను కొన్ని రోజులు పార్లమెంటు కు కూడా పోనివ్వలేదని, తమకు కాళేశ్వరంపై జాతీయ హోదా పోరాటం చేయాలని చెప్పి… తాను కనీసం ఒక్క లెటర్ కూడా రాయలేదని, సదరు మంత్రి పిలిచి చెప్పేసరికి ఎంపీలంతా అవమానపడ్డారని మండిపడ్డారు. తాను ఒక్కన్నే కాదని… స్వయంగా పార్లమెంటరీ పార్టీ నేతలుగా ఉన్న ఎంపీలు కే.కేశవరావు, జితేందర్ రెడ్డిలు కూడా త్వరలో పార్టీ మారబోతున్నారని, వారంత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. తమకు టీఆరెఎస్ లో ఎంపీలుగా గౌరవం లేదని, జై తెలంగాణ అని నినదించిన తాము… ఇప్పుడు జై కేసీఆర్, జై కేటీఆర్ అనాల్సి వస్తుందని మండిపడ్డారు.