పొత్తుల్లో కొత్త ఎత్తులు, ఇదీ కోదండ‌రాం మార్క్

రాజ‌కీయాలు- ఉద్య‌మాలు- ఉద్య‌మ భావ జాల వ్యాప్తి. ఇవ‌న్నీ ఓకేలా క‌న‌ప‌డుతున్నా… వీటి మ‌ద్య ఎంతో దూరం ఉంటుంది. ఎంత‌లా అంటే… ఎంత లోతుగా చూసినా, ఇంకా క‌న‌పడ‌లేనంతా ఆగాధం. కానీ ఇవీన్నీ తెలిసే స‌రికే పుణ్యాకాలం పూర్త‌వుతుంది. అందుకే ఎక్కువ మంది ప్ర‌జాసంఘాలు, ఉద్య‌మ‌కారులుగానే ఉండిపోతారు త‌ప్పా, వీరంతా రాజ‌కీయనాయ‌కులుగా పూర్తిగా ప‌రావ‌ర్తనం చేంద‌లేరు. అదే కోవ‌లోకి వ‌చ్చే వారే కోదండ‌రాం మాష్టారు.

Kodandaram Sir

తెలంగాణ‌లో కోదండ‌రాం అంటే ఆ సారా… అంటారు. కానీ, ఓట్ల పంచాయితీ వ‌చ్చే స‌రికి, కేసీఆర్ కు స‌రితూగుతాడా…. అంటే లేదు. ఓ ద‌శలో కేసీఆర్- కోదండ‌రాం స‌మ ఉజ్జీవులు. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ రాజ‌కీయ పార్టీలుగా టీఆర్ఎస్-టీజెఎస్ స‌మ ఉజ్జీవులా…. ? క‌నీసం కోదండ‌రాం పార్టీ పోటీ ఇవ్వ‌గ‌లుగుతుందా….? ఇవ‌న్నీ చ‌ర్చించుకోవాల్సిందే.

అయితే, ఉద్య‌మ‌కారుడికి ఉండే దూర‌దృష్టి తో కోదండ‌రాం పార్టీని నెట్టుకొస్తున్నారు. పార్టీలో ఇప్ప‌టికే దూర‌దృష్టి ఉన్న నేత‌లు లేక‌పోవ‌టం, ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడిన పెద్ద నాయ‌కులు టీజెఎస్ లో లేరు. అది సుస్ప‌ష్టం. అందుకే కోదండ‌రాం అలాంటి నేత‌ను పార్టీలోకి తీసుక‌రాబోతున్నారు. తెలంగాణ కొత్త ఫైర్ బ్రాండ్ ర‌చనారెడ్డి.

అవును ర‌చ‌నారెడ్డి అధికారికంగా… రాజ‌కీయాల్లోకి రాబోతున్నారు. తెలంగాణ‌లో మ‌హ‌కూట‌మి పొత్తుల వేలా… పెద్ద నాయ‌కులు ఎవ‌రూ లేరు, ఎవరు పోటీ చేస్తారు, ఎవ‌రు గెలుస్తారు అన్న మాట రాకుండా ఉండేందుకు, ర‌చ‌నా రెడ్డి లాంటి వారిని పార్టీలోకి ఆహ్వ‌నించారు. ర‌చ‌నా రెడ్డి ఎల్గారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ర‌చ‌నా రెడ్డితో పాటు మ‌రికొంత‌మందిని కూడా కోదండ‌రాం పార్టీలోకి ఆహ్వ‌నించ‌గా, వారు మ‌రికొద్దిరోజుల్లో పార్టీలోకి వ‌చ్చే సూచ‌న‌లు క‌న‌ప‌డుతున్నాయి.

ఇప్పటికే పార్టీలో గాదె ఇన్నయ్య, దిలీప్ కుమార్, రౌతు కనకయ్య, గోపాల్ శర్మ, విశ్వేశ్వర్ రావు, చింత స్వామి, శ్రీశైల్ రెడ్డి, విద్యాధర రెడ్డి, భవాని రెడ్డి, చిందం రాజ్ కుమార్, రాజేందర్ రెడ్డి, గురిజాల రవీందర్ తో పాటు మరికొంత మంది పోటీకి సిద్దంగా ఉన్నారు.

మ‌రోవైపు ఇన్నాల్లు ఐదు, అరు… సీట్లతోనే స‌రిపెట్టుకుంటారా అన్న ప్ర‌శ్న‌ల‌కు తాజా చేరిక‌లు చెక్ పెట్టిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. మ‌రిన్ని చేరిక‌లు జ‌రిగితే, కోదండ‌రాం పార్టీ కూడా రెండంకెల స్థానాలు గెలుచుకోవ‌టం ఖాయం గా క‌న‌ప‌డుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *