KCR పై సంచలన వ్యాక్యలు చేసిన మందకృష్ణ మాదిగ | MRPS Leader MandaKrishna Madiga

సికింద్రాబాద్ సివిల్ కోర్టు కు హాజరైన మంద కృష్ణ మాదిగ -మందకృష్ణ మాదిగ:

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండ రామ్ లాంటి వాళ్ళు పర్యటన చేసే స్వేచ్ఛలేదు, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన MRPS దీక్ష చేసే స్వేచ్ఛలేదు.

పవన్ కళ్యాణ్ తిరిగేందుకు అనుమతిచ్చారు. మమ్మల్ని ఆపేందుకు పోలీసులను పెట్టారు…పవన్ కళ్యాణ్ తిరిగేందుకు పోలీసులను పెట్టారు. తెలంగాణాలో కెసిఆర్ పునాదులు కదులుతున్నాయి…ఆ పునాదులను కాపాడేందుకు పవన్ కళ్యాణ్ ను తిప్పుతుతున్నారు.

పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు వస్తున్నారు…కానీ ఓటేసేందుకు ఎవ్వరురారు. ఇక్కడ కెసిఆర్ పాలనా’ ఏపీలో సీఎం చంద్రబాబు పాలన పవన్కళ్యాణ్ బాగుందంటున్నారు. అంతా బాగుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు తిరుగుతున్నారు. చాలామంది పిచ్చోళ్ళను చూశాను కాని పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోన్ని చూడలేదు. సీఎం కెసిఆర్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ల పై గతంలో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులు తిరగదోడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ ను కలుస్తాను. గవర్నర్ చట్టం అందరికి సమానంగా పనిచేసేవిధంగా చూడాలి. చట్టం ఒకరికి చుట్టంగా…మరోకరిని అణచివేసేవిధంగా ఉండకూడదు. నా పై నాన్ బెయిలబుల్ కేసు లేకున్నా నన్ను జైల్లో ఎందుకు పెట్టారు…?

ఈ విషయంలో గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కెసిఆర్ గతంలో పది రోజులు దీక్ష చేసినప్పుడుఎందుకు పట్టించుకోలేదు. ఎందుకు కేసులు పెట్టలేదు. నేను 48 గంటలు దీక్ష అని…48 సెకన్లు కూడా చేయకుండానే ఎందుకు అరెస్ట్ చేశారు…?

మిలియన్ మార్చ్ ఘటన లో అత్యంత విధ్వంసం జరిగింది. అందుకు కారణమైన వారిని ఆ ఘటనలో అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు…? ప్రజా ఉద్యమం అణచివేయలని సీఎం కెసిఆర్ చూస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళకు పోలీస్ వ్యవస్థ కక్ష తీర్చుకునే యంత్రాంగం గా మారోద్దు. గవర్నర్ ను కలిసేందుకు ఈరోజు అపోయాయింట్ కోరుతాం…

దొరలకు ఒకన్యాయం….దళితులకు ఒక న్యాయమా….? అని అడుగుతాం…

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సి వర్గీకరణ పై బిల్లు తేవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీఎం కెసిఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశం పై ఒత్తిడితెస్తాం.

27 లోపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని రాజకీయపార్టీలను భాగస్వామ్యం చేసి మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *