కొలిక్కి వ‌చ్చిన సీట్లు, మ‌హ‌కూట‌మి సీఎం అబ్య‌ర్థి ఎవ‌రూ….? ఆ నాయ‌కుడికే చాన్స్ ?

మ‌హ‌కూట‌మిలో సీట్ల పంచాయితీ దాదాపు ముగిసిన‌ట్లేన‌ని తెలుస్తోంది. ఓ సీటు అటు ఇటుగా… కూట‌మి ప‌క్షాలు క‌లిసే పోటీచేయ‌నున్నాయి. అయితే… కూట‌మి పెద్ద‌న్న పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ నుండే సీఎం అబ్య‌ర్థి ఉండ‌బోతున్నారు. అయితే… ఆ సీఎం ఎవ‌రు, మ‌హ‌కూట‌మి త‌రుపున సీఎం అబ్య‌ర్థిగా ఎవ‌రు ఉండ‌బోతున్నారు. ఇప్పుడిదే చ‌ర్చ తెర‌పైకి వ‌స్తోంది.

Telangana CM

మ‌హ‌కూట‌మి పేరుకే అయినా, అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉంది కాబట్టి… ఆ పార్టీ నుండే సీఎం అబ్య‌ర్థి ఉంటారు. అయితే… సీఎం అబ్య‌ర్థిని ఎన్నిక‌లు పూర్త‌య్యాకే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కాక‌పోతే… నేత‌లంతా ఇప్ప‌టికే త‌మ‌కో అవ‌కాశం కావాలంటూ… కొంత‌మంది నేత‌లు ఇప్ప‌టికే అధిష్టానం వ‌ద్ద మంత్రాంగాలు కూడా మొద‌లుపెట్టారు. అయితే… కేంద్ర నాయ‌క‌త్వం కూడా సామాజిక స‌మీక‌ర‌ణాలు భేరీజు వేసుకొని డిసైడ్ చేసే అవ‌కాశం ఉంది.

అయితే, ఇది వ‌ర‌కే కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన‌ట్లు… కాంగ్రెస్ నుండి ఈసారి ద‌ళిత్ ముఖ్య‌మంత్రి ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలు క‌న‌ప‌డుతోన్నాయి. ఆవైపుగా… ప్ర‌చారంలోనే కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సంకేతాలు పంపించే అవ‌కాశం ఉందంటోన్నాయి పార్టీ వ‌ర్గాలు.

Related image

కేసీఆర్ మోసం చేసిన ద‌ళిత సీఎం హ‌మీని తాము నేర‌వేరుస్తామ‌ని చెప్పే అవ‌కాశం ఉంద‌ని, అందుకే ఆ సామాజిక వ‌ర్గానికే చెందిన నేత‌కు ఎన్నిక‌ల క్యాంపెయినింగ్ కమిటీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌టమే అందుకు నిద‌ర్శ‌నం అన్న వాద‌న‌లు ఉన్నాయి.

Image result for madhu yashki

ఇక బీసీ కోటా నుండి… ఈసారి అన్యూహ్యంగా ఓ పేరు తెర‌పైకి దూసుకొచ్చింది. రాహుల్ కోట‌రితో పాటు, ఏఐసీసీలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ పేరు తెర‌పైకి వ‌స్తోంది. కొంత‌కాలంగా… ఆయ‌న బీసీ నేత‌లు, బీసీల అంశంపై చురుగ్గా ఉన్నారు. ఇక యాధావిదిగానే పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేరు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. పేరుకు ఆయ‌న అధిష్టానం నిర్ణ‌యిస్తుంద‌ని చెబుతున్నా, ఆయ‌న సీఎం కుర్చీపై సీరీయ‌స్ గా ఉన్నార‌ని… ఇప్ప‌టికే ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం ఉత్త‌మ్ ఫ‌ర్ సీఎం అంటూ ఓ ప్రత్యేక పేస్ బుక్ పేజీని కూడా ఏర్పాటు చేశారు. ఇక సీనీయ‌ర్ నేత జైపాల్ రెడ్డ పేరు కూడా ప్ర‌చారంలో ఉంది. మ‌హిళా కోటా నుండి డీకే అరుణ‌, స‌బితా, గీతారెడ్డి పేర్లు వినిపిస్తున్నా…. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో, మ‌హిళ‌కు సీఎం ప‌ద‌వి కాకుండా… డిప్యూటీ సీఎం ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Image result for uttam kumar reddy

అయితే… నేత‌లు మాత్రం ఎవ‌రికి వారు త‌మ‌, త‌మ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ద‌ళిత్ కార్డు ప్ర‌యోగించే అవ‌కాశం ఉంద‌న్న నేప‌థ్యంలో…. భ‌ట్టి, దామోద‌ర త‌మ‌, త‌మ ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు వారి అనుచ‌రులు అంటున్నారు. అందుకే భ‌ట్టి ఈ మ‌ద్య వైఎస్ లాగే… పంచ‌క‌ట్టులోనే క‌న‌ప‌డుతున్నారంటున్నారు అనుచ‌రులు.

Image result for kodandaram

అయితే… ఈ ఎన్నిక‌లు కేసీఆర్ కు వ్య‌తిరేకంగా, తెలంగాణ ఉద్య‌మ శ‌క్తులతో అన్న లైన్ ఏఐసీసీ తీసుకునే అవ‌కాశం ఉంద‌ని, అలాంటి స‌మ‌యంలో…. కేసీఆర్ కు దీటుగా, కోదండ‌రాం ను సీఎం అబ్య‌ర్థిగా ప్ర‌క‌టించే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. వీటిపై ఇప్ప‌టికే ఏఐసీసీ కొంత క‌స‌ర‌త్తులు చేసింద‌ని, అందులో భాగంగానే ఇటీవ‌ల రాహుల్ గాంధీ స్వ‌యంగా కోదండ‌రాం ను పిలిచి మాట్లాడార‌ని అంటున్నారు టీజెఎస్ లోని కీల‌క నేత‌లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *