ఎంపీ బీబీ పాటిల్ కనిపించడం లేదని కేసు పెట్టాలి: మదన్ మోహన్ రావు

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ మదన్ మోహన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించి 60 ఏండ్ల వయస్సులో జనం సమూహం మధ్యలో బర్త్ డే పార్టీ చేసుకున్న నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చెయ్యలేదంటూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అవసరమైతే పదేళ్లు జైల్లో ఉండడానికి అయినా సిద్ధమేనని అధికార పార్టీకి సవాల్ విసిరారు.

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో కొవీడ్ 19 దరిచేరకుండా నిరంతర వ్యాక్సిన్ హైపో క్లోరైడ్ ద్రావణాన్ని, మదన్మోహన్ ట్రస్టు ద్వారా సొంత డబ్బులతో స్ప్రే చేస్తున్నట్టు ఎంపీ మదన్ మోహన్ రావు అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నివారణ లో భాగంగా ప్రజల సంక్షేమం కోసం నారాయణఖేడ్ పురవీధుల గుండా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తే, మాపై కేసులు నమోదు చేసిన సిగ్గుమాలిన చర్య ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికె చెందింది అన్నారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా తాను ప్రజల మనిషిని అని ఇలాంటి వాటికి నేనెప్పుడూ భయపడను అంటూ మదన్ మోహన్ రావు గట్టి కౌంటర్ విసిరారు. కొవీడ్ 19 నిబంధనలను ఉల్లంఘించి ప్రజల సమూహంలో బర్త్డే పార్టీలు జరుపుకున్నది ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. భూపాల్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని తిట్టని తిట్టు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్ పై గట్టి కౌంటర్ విసిరారు. కరోనా వైరస్ తో సతమతమవుతూ, ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారిని ఆదుకోకుండా ఎంపీ బీబీ పాటిల్ ముఖంచాటేశారనీ ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి పై పోలీస్ స్టేషన్లో కనిపించడం లేదంటూ కేసు నమోదు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *