చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. లక్ష మంది జనంతో కొండా, టీఆరెస్ కు సవాల్..

ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగులుంది. పార్టీలన్నీ తమ బలాలను నిరూపించుకునే పనిలో పడ్డాయి. దానిలో భాగంగా బహిరంగ సభలకు తెరలేపాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టుకున్నాయి. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిన్న నిర్వహించిన భారీ బహిరంగ సభకు లక్ష మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యి కాంగ్రెస్ పార్టీలో ఆశలు తీసుకొచ్చారు.

ఒకవైపు ఎండ, మరోవైపు ఎన్నికల వేడి, ఇంకో వైపు ఐపిఎల్ ఆట. వీటన్నిటి మధ్యలో ఓటర్లను, కార్యకర్తలను సభ ప్రాంగణం దాకా తీసుకురావడం పెద్ద ప్రహసనమే. ఇప్పటికి నిర్వహించిన సభల్లో చాలావరకు జన సందోహం కనిపించలేదు. టీఆరెస్ అధినేత కేసీయార్ సభ అంటే జనాల గురించి ప్రస్తావన అవసరం లేదు. అలాంటి ఆయన ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభకు పట్టుమని 10 వేల మంది కూడా తరలిరాకపోవడంతో చివరి నిమిషంలో సభ రద్దు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

కానీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్లలో నిర్వహించిన” చేవెళ్ల ఆత్మగౌరవ సభ” కు విశేష స్పందన వచ్చింది. గులాం నబి ఆజాద్, విజయశాంతి సహా కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దగ్గరుండి పనులను పర్యవేక్షించాడు. లక్షకు పైగా జనం హాజరయ్యి కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపారు. కొండా లాంటి నాయకుడు దొరకడం మీ అదృష్టం అని ఆజాద్ వ్యాఖ్యానించగా, కేసీయార్ మీద పంచుల వర్షంతో విజయశాంతి ఆకట్టుకున్నారు.

ఇక చేవెళ్లలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క తాండూరు ఎమ్మెల్యే మినహా అందరినీ టీఆరెస్ పార్టీలో కలుపుకున్న తెరాస కు ఇది మింగుడుపడని విషయమే. ఇప్పటికే జెట్ స్పీడుతో నియోజకవర్గం అంతా చుట్టొచ్చిన కొండాకు ఈ సభ మరింత మైలేజి ఇస్తుందనందంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *