సీమాంధ్రులను ఇబ్బంది పెట్టలేదా? నిజమేనా?

సకల జనుల సర్వే పేరిట సీమాంధ్రులను భయపెట్టలేదా? మొదట సర్వే ఫారాల్లో పూర్వీకుల వివరాల గురించి ప్రశ్నలు ఉన్నది నిజం కాదా?

Image result for Sakala Janula Survey

సీమాంధ్రుల్ని వెళ్లగొట్టడానికే సర్వే అని సీఎం పీఆర్వో విజయ్ మాట్లాడిన వీడియో బయటపడింది. ఆ విజయ్ మీద చర్య తీసుకున్నారా? జీనియాలజీ ద్వారా ఎవరి మూలాలు ఏమిటో కనిపెడతామని సాక్షాత్తు కేసీఆర్ అనలేదా?

KTR

తెలంగాణ మూలాలు ఉన్న విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేలా ఫాస్ట్ పథకం తెచ్చింది నిజం కాదా? దీనిపై సీమాంధ్రులు ఎంత అభ్యంతరం తెలిపినా మీరు వెనక్కి తగ్గలేదు కదా? చివరికి కోర్టు కొట్టేసిన తర్వాతే కదా ఈ వివక్షకు తెర పడింది!

తాజాగా ఏ రాష్ట్రంలో లేని విధంగా 95% ఉద్యోగాలు స్థానికులకు కేటాయిస్తూ జోనల్ వ్యవస్థ తీసుకురావడంలో సీమాంధ్రులపై వివక్ష లేదా?

Related image

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా అని మన్మోహన్ ప్రకటిస్తే దానిని టీఆర్ఎస్ వ్యతిరేకించలేదా? ఏపీకి ఇక హోదా రాదని రూఢి చేసుకున్నాక అప్పుడు హోదా ఇవ్వాలంటూ కవిత గారు మాట్లాడలేదా? ఇటీవల ప్రత్యేక హోదా కోసం సీమాంధ్రులు ఉద్యమిస్తుంటే ఆ డిమాండ్ ను మళ్లీ మీరు వ్యతిరేకించలేదా?

కేసీఆర్ విమర్శలు నాయకుల మీదేనా? సీమాంధ్ర ప్రజల మీద కాదా? సీమాంధ్రుల బిర్యానీ పేడలా ఉంటుందన్న కేసీఆర్ విమర్శ ఏ నాయకుడి మీద చెప్పండి సార్! లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే, సీమాంధ్రలో పుట్టినోళ్లంతా తెలంగాణ ద్రోహులే అన్న కేసీఆర్ వ్యాఖ్య ప్రజల మీద కాదా సార్?

అమరావతి నిర్మాణానికి 100 కోట్లు ఇద్దామనుకున్నారా? కానీ మోదీ మట్టి, నీళ్లు మాత్రమే తేవడంతో ఆయన ఎదుట ప్రకటన చేస్తే బాగుండదని ఆగిపోయారా? అది జరిగి మూడేళ్లయ్యింది. ఈ మూడేళ్లలో ఏ రోజైనా సాయం ప్రకటించవచ్చు కదా సార్! కానీ ఎందుకు ప్రకటించలేదు సార్? మోదీ మట్టి, నీళ్లయినా ఇచ్చాడు. మీరు మాటలే ఇచ్చారు కదా సార్?

ఎన్నికల సమయంలోనైనా మీకు మా మీద ప్రేమ పుట్టుకొచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రేమించడం మీ హక్కు. ఆ ప్రేమ నిజమో కాదో ఆలోచించడం మా హక్కు. ఎందుకంటే ప్రేమోన్మాద సంఘటనలు ఈమధ్య ఎక్కువైపోయాయి. మా జాగ్రత్తలో మేం ఉండాలి కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *