క‌ట్నాలెక్క మారిన ఎన్నిక‌ల హ‌మీలు… గీ 3016,2016రూపాయ‌ల గోల ఏందీ….?

తెలంగాణ‌ల పెండ్లీల‌కు క‌ట్నాలు స‌దివిస్తుంట‌రు, ఎవ‌రి ఇంట్ల పెండ్లీ అయితే… వారికి. అదే మేన‌మామ అసొంటోల్లు జ‌రంత ఎక్కువ పెడుత‌రు. ఇది తెలంగాణ‌లో ఆనాటి నుండి వ‌స్తున్న సంప్ర‌దాయం. కానీ ఇవ్వాళ కేసీఆర్ ఇచ్చిన ఎన్నిక‌ల హ‌మీలు చూస్తే… మ‌ళ్లీ పాత తెలంగాణ రోజులు గుర్తుకు వ‌చ్చిన‌యి. కానీ కేసీఆర్… విక‌లాంగుల‌కు 3016, ఆస‌రా పెన్ష‌న్లు 2016, నిరుద్యోగ బృతి 3016 ఇట్లా 16 ప‌ద‌హారు అంటూ పంతులుకు ఇచ్చిన‌ట్లు ఎందుకు పెట్టిండు అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Telangana Elections

ఇందులొ కూడా ఎదైనా మ‌ర్మం ఉందా అంటే… కేసీఆర్ ఎం చేసినా రాజ‌కీయంగా… చూసుకొనే చేస్త‌డు అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కాదు… చాలామంది ప‌ట్టించుకోలేదు… క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కంలో కూడా ఈ 16 నెంబ‌రు ఉంట‌ది. కానీ మ‌న‌వారు ఎవ‌రూ దాన్ని ప‌ట్టించుకోలేదు. కాక‌పోతే… ఈ మ‌ద్య కేసీఆర్ కు ఈ ప‌ట్టింపులు, న‌మ్మ‌కాలు మ‌రీ ఎక్కువ‌గా కావ‌టంతో… అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది.

ఈ ప‌ద‌హారు సంఖ్య‌లో ఆరు ఉండ‌టం, ఆరు సంఖ్య కేసీఆర్ కు అచ్చిరావ‌టం వ‌ల్లే… కేసీఆర్ త‌న అదృష్ట సంఖ్య‌తో కూడిన మొత్తాన్ని అనౌన్స్ చేశారంటున్నారు టీఆర్ఎస్ నేత‌లు. ఏమీస్తే ఎందుకు ఇచ్చిన‌మా లేదా అన్న‌ది ముఖ్యంగానీ అంటూ కేసీఆర్ ను వెన‌కేసకొస్తున్నా… కేసీఆర్ న‌మ్మ‌కాలు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చీధ‌ర‌గా ఉన్నాయ‌న్న అభిప్రాయం ఎదుర‌వుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *