తండ్రీ కొడుకుల మ‌ద్య కొట్లాట పెట్టిన న‌గ‌ర మేయ‌ర్

నేను మాటంటే మాటే. నా మాటే శాసనం… ఈ ప‌దాలు రీల్ లైఫ్ కు సెట్ట‌వుతాయేమో కానీ, రాజ‌కీయాల‌కు మాత్రం సెట్ కావు. ఏ రోజు కా రోజు, యే పుట కా పూట మారుతూనే వుంటాయి. అయినా, అంద‌రీకీ ఆశ‌లు. తాజాగా టీఆర్ఎస్ ప్ర‌క‌టించిన అబ్య‌ర్థుల జాబితా చూశాక కూడా కొంత‌మంది ఆశావాహుల‌కు ఇంకా ఎదోమూల ఆశ‌లు ఉండే ఉన్నాయి. అందుకు బెస్ట్ ఉదాహ‌రణ హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మెహాన్.

KCR KTR

ఉప్ప‌ల్ నుండి సీటు ఆశించి, మేయ‌ర్ గా వున్న అధికారంతో ఉప్ప‌ల్ పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టి మ‌రీ ప‌నిచేసుకున్నారు మేయ‌ర్ బొంతు రామ్మెహ‌న్. త‌న‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌దు అనుకున్న ఆయ‌న‌, వాళ్ల సీతీమ‌ణిని కూడా యాద‌వ సంఘాల్లో యాక్టివ్ చేసి, త‌న‌కైనా ద‌క్కేలా ప్లాన్ చేసుకున్నారు. పైగా యువ‌రాజు కేటీఆర్ కు ప్రియ‌శిష్యుడు. ఇక సీటు ప‌క్కా అనుకున్నారు అంతా. స్థానిక కార్పోరేట‌ర్లు కూడా ఇంచార్జీగా వుండి, ప్ర‌స్తుతం టికెట్ ద‌క్కించుకున్న సుభాష్ రెడ్డి ని ప‌క్క‌న పెట్టి మేయ‌ర్ వ‌ర్గంలోనే వున్నారు. ఇంత దీమాగా వున్న త‌న‌కు కాద‌ని, ఇంచార్జీగా సీటు ఇవ్వ‌టంతో నివ్వేర‌పోయిన మేయ‌ర్ బొంతు… త‌న గురువు కేటీఆర్ ద్వారా పావులు క‌దుపుతున్నారు.

నాకు కాక‌పోతే, నా భార్య‌కు టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో… కేటీఆర్ ఇర‌కాటంలో ప‌డ్డారు. ఒ వైపు తండ్రీ… మ‌రోవైపు శిష్యుడు. కానీ కేటీఆర్ త‌న శిష్యుని టికెట్ పై కేసీఆర్ తో మాట్లాడుతా అని హ‌మీ ఇచ్చార‌ట‌. అందుకే స్థానిక ఉప్ప‌ల్ కార్పోరేట‌ర్లు అంతా మేయ‌ర్ కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ… ఓ స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు మేయ‌ర్ అలిగి బెంగుళూర్ వెళ్లిపోయాడ‌ని జ‌రిగిన ప్ర‌చారాన్ని ప‌క్క‌న‌పెడుతూ, కేటీఆర్ ప‌క్క‌నే మేయ‌ర్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఓవైపు పార్టీ ధిక్కార మీటింగ్ కు స్థానిక కార్పోరేట‌ర్లు హ‌జ‌రైతే, మేయ‌ర్ కేటీఆర్ ప‌క్క‌న ఉన్నాడ‌ని, ఇదే స్థానంలో మ‌రేవ‌రైనా ఉండివుంటే…. పార్టీలో వుండ‌నిచ్చే వారా? అని ఇత‌ర నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

కేటీఆర్ కూడా కేసీఆర్ తో మాట్లాడి… ఉప్ప‌ల్ సీటు వ‌చ్చేలా చూస్తాన‌ని హ‌మీ ఇచ్చార‌ని మేయ‌ర్ వ‌ర్గీయులు చెప్పుకుంటున్నారు. మ‌రీ యువ‌రాజు మాట‌ను కేసీఆర్ ప‌క్క‌న పెడుతారా లేక కొత్త సంప్ర‌దాయానికి తెర‌తీసి, సుభాష్ రెడ్డికి ఇచ్చిన సీటు వెన‌క్కి తీసుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *