ఓటమి అంచున టీఆర్ఎస్. అస‌హ‌నంలో ఉన్న కేసీఆర్… అందుకే ఈ విపరీత ప‌రిస్థితులా…?

ముంద‌స్తు ఎన్నిక‌లు త‌మ‌ను ముంచ‌బోతున్నాయా… అంటే అవున‌నే భావ‌న‌లో ఉంది టీఆర్ఎస్ పార్టీ. అందుకే గ‌త కొంతకాలంగా టీఆరెఎస్ అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోందని మ‌హ‌కూట‌మి నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఇందుకు వారు కొన్ని అంశాల‌ను కూడా ప్ర‌స్తావిస్తున్నారు.


కేసీఆర్ పార్టీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని, అందుకే కొంత కాలంగా మ‌హ‌కూట‌మిలో, గ‌తంలో ప్ర‌భుత్వం పై ఫైట్ చేసిన వారిని న‌యానో బ‌యానో పార్టీలోకి చేర్చుకోవటంతో పాటు, తాజాగా కేసీఆర్ ప్ర‌వ‌ర్త‌న‌ను కూడా కోట్ చేస్తున్నారు.

ఇటీవ‌ల‌.. సంగారెడ్డి, అశ్వ‌రావు పేట‌లో అక్కడి స్థానిక అబ్య‌ర్థుల ప‌ట్ల కేసీఆర్ అనుస‌రించిన ప‌రిస్థితుల‌ను వారు ఉద‌హ‌రిస్తున్నారు. సంగారెడ్డిలో కేసీఆర్ త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా… అక్క‌డి టీఆర్ఎస్ అబ్య‌ర్థిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. గ‌డ్డిపోచ‌లా తీసిపారేశారు. ఇటు ఖ‌మ్మం జిల్లా అశ్వార్రావుపేట క్యాండిడేట్ పై కూడా అంత‌క‌న్నా దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు… అక్క‌డ కేసీఆర్, ఆయ‌న పార్టీ ఓట‌మి పాలుకాబోతుంద‌న్న భ‌యంతోనే వారి ప‌ట్ల చిన్న‌చూపు అని నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వంతో ఫైట్ చేసిన ర‌చ‌నారెడ్డి, ఓయూ జేఏసీ నేత‌లు రాజ‌రాం యాద‌వ్ ల‌ను పార్టీలో చేర్చుకోవ‌టం కూడా ఇందులో భాగ‌మేన‌ని…. పోలింగ్ ముందు ఇలాంటి నేత‌ల‌ను లొంగ‌దీసుకొని ఇలా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇక కేసీఆర్ ఇటీవ‌ల ప‌రేడ్ గ్రౌండ్ స‌భ అట్ట‌ర్ ప్లాప్ కావ‌టంతో… త్వ‌ర‌లోనే స‌ర్వేలు వ‌స్తాయి… మ‌న గెలుపు చెప్తారంటూ… ఆయ‌న ప్ర‌సంగాల‌ను కూడా వారు ఉద‌హ‌రిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *