నిజంగా దళిత బందునా ? మా నోర్లు ‘బంద్’ నా బాంచెన్?

40 వేల దళిత ఓట్ల కోసం హుజూరాబాద్ ఎన్నికల లక్ష్యంగా కెసిఆర్ తెస్తున్న దళిత క్రాంతి పథకం పైన ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి విశ్లేషణ.


1.దళిత బంధు ప్రధకం దళితులని రాబందులా పీక్కుని తింటున్న కులరక్కసిని చంపేస్తుందా?
2.మొన్న పోలీసుల చేత చంపబడ్డ మరియమ్మ లాంటి చావులని మళ్ళీ చూడకుండా చేస్తుందా? న్యాయం జరుగుతుందా?
3.నిన్న పదివేల కోసం చదువు కొన’లేక , తల్లి తండ్రులని కష్టపెట్టలేక సూసైడ్ వీడియో తీసుకుని చనిపోయిన ఆడబిడ్డని తీసుకొస్తుందా ? ఎంతోమంది ఫీజ్ లు కట్టలేక కూలి పని చేసుకుంటున్న వాళ్ళకి ఉచిత చదువునిస్తుందా ?
4. 15 ఏండ్లకే బీర్ బాటిళ్లు పట్టుకుని తల్లి తండ్రులని కొట్టడానికి కారణమైన బెల్ట్ షాప్ లని బంద్ చేస్తుందా?
5.ప్రేమించిన పాపానికి పాశవికంగా చంపి పడేస్తున్న సమాజాన్ని కనీసం ప్రశ్నిస్తుందా ?
6.అపుడెపుడో బీడుపడ్డ భూముల్ని దళితుల మొహాన కొడితే చెమట , రక్తం కలబోసి చదును చేసి నాలుగు రాళ్ళు వస్తాయని చూసేలోపల ప్రభుత్వ పధకాలన్నింటికి దళితుల భూముల్ని లాక్కోవడం ఆగుతుందా ?
7.అంబెడ్కర్ సంపాదించి పెట్టిన రిజర్వేషన్ల లో పదవులిచ్చి నోరు మూయించి మూలకి కూర్చోపెడుతున్న దొరలని ప్రశ్నించే ధైర్యాన్నిస్తుందా?
రాజ్యాంగ బద్ధంగా వచ్చిన హక్కు ప్రశ్నించడం , ఆ ప్రశ్న వేసినందుకు, అణగారిన ప్రజల పక్షాన నిలబడినందుకు 8.కేసులని ,జైళ్లని నిర్బంధాన్ని కానుకగా ఇస్తున్న ప్రభుత్వాలని మారుస్తుందా ?
9.పదవుల ఎర చూపి, 24 గంటలు నిఘా పెట్టి దొరల గడిల కట్టేసి పడేసే అహంకారాన్ని అణచివేస్తుందా ?
10. గ్రామ గ్రామాన , బస్తీల్లో, తాగుబోతు భర్తలని భరిస్తూ, బిడ్డల్ని కనీసం చదివించుకోలేని , తిండి పెట్టలేని మరియమ్మలు 40 ఏండ్లకే ఆవిరైపోతుంటే , ఉన్న వాళ్ళకి విధవ పెన్షన్లు కాకుండా గౌరవం గా బ్రతికే వేలుని కల్పిస్తుందా?
11. నిరుద్యోగ దళిత యువకులు మతం, కులం మత్తులో జోగుతున్న పార్టీలలో మందు , విందు, పొందు కోసం పొర్లు దండాలు పెట్టి బాంచెన్ దొరా అని పోతుంటే ఆపగలదా..
12. అన్ని నామినేటెడ్ పదవులలో , పార్టీల చంచాలని పెట్టుకుని ,దళిత పురుషులకు మాత్రమే కట్టబెట్టడాన్ని కనీసం ప్రశ్నించే వీలు కల్పిస్తుందా ?

మంద కృష్ణ మాదిగ@పార్సీగుట్ట ఎమ్మార్పీఎస్ ఆఫీస్

కెసిఆర్ హుజురాబాద్ భయం పెట్టుకుంది

ఏడేళ్లలో దళితులకు చేసిన మోసాలే కెసిఆర్ కు ఓటమి భయాన్ని తీసుకొచ్చింది

భ్రమలు పెట్టడం కెసిఆర్ వెన్నతోపెట్టిన విద్య

12 ఏళ్ళు దళితుడే ముఖ్యమంత్రి అని భ్రమల్లో పెట్టిన కెసిఆర్, అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు ఒక చిన్న సాకుతో తప్పుకున్నాడు

మూడెకరాల భూ పంపిణి ప్రారంభించిన మొదటి సంవత్సరమే ఆపేసిండు

దళిత బంధు ను కూడా అట్లనే ఆపేయగలడు

హుజురాబాద్ లో ఎట్లైనా గెలవాలనే కెసిఆర్ దళిత బందు ప్రకటన చేసారు

ప్రభుత్వ సర్వే ప్రకారమే దాదాపు 21వేల కుటుంబాలున్నాయి

80 వేల మంది ప్రజలున్నారు

దళిత ఓట్లు కీలకం కాబోతున్నాయి

వారిని అక్కున చేర్చుకుంటున్నట్లుగా కెసిఆర్ పథకాన్ని ప్రవేశపెట్టారు

కెసిఆర్ కు హుజురాబాద్ జ్వరం రోజురోజుకు పెరుగుతుంది

అందులో భాగంగానే ప్రతి దళిత కుటుంబానికి 10లక్షలు అంటూ పథకాన్ని తీసుకొచ్చింది

దళితుల మనోభావాలు ఎలా ఉన్నాయనేదానిపైనే సర్వేలు చేయిస్తున్నారు

70 శాతం దళిత యువత వ్యతిరేకంగా ఉన్నారు

ఏడేళ్లుగా కెసిఆర్ చేస్తున్న మోసాలపై గుర్రుగా ఉన్నారు

కెసిఆర్ అహంకారానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారనే అంశం వారు నిర్వహించుకున్న సర్వేల్లో వస్తుంది

ఈ ఎన్నిక ఫలితమే 2023 పునరావృతం అవుతుందనే భయం కెసిఆర్ కుంది

అందుకే రైతుబంధు నాటకం లెక్కనే దళిత బంధు ను ఎత్తుకున్నారు

రాజకీయ లబ్ది, ఓట్లకోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది

హుజురాబాద్ లో ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టే దళిత బంధు కు నిధులు ఎక్కడివో చెప్పాలి

హుజురాబాద్ లో మొదలుపెట్టి హుజురాబాద్ లో ముగించే పథకమో స్పష్టం చేయాలి

బడ్జెట్ కేటాయింపులు ఎక్కడి నుంచి తీస్తున్నారో చెప్పాలి

సబ్ ప్లాన్ లో ఇచ్చిన నిధులు వాడుతున్నారా?

అదనపు నిధులైతే బడ్జెట్ ఎక్కడిది

119 నియోజక వర్గాలకు 1200 కోట్లని ఒక్క హుజురాబాద్ కోసం మాత్రం 2వేల కోట్లు యెట్లా ఖర్చు చేస్తున్నారు

భూములు అమ్మగా వచ్చిన డబ్బును కేటాయిస్తున్నారా లేక సీఎం వేరే బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారా అనే అంశాన్ని స్పష్టం చేయాలి

దళితుల కోసం 90వేల కోట్ల నిధులు కేటాయించి 55 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నా ప్రభుత్వం మిగిలిన 35వేల కోట్లు ఎక్కడున్నాయో ప్రభుత్వం బహిరంగ పరచాలి

35 వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారనేదానికి సాక్షలున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *