కెసిఆర్ కాళేశ్వరం తిప్పి పోతలతో 30 కోట్లు నీళ్ల పాలు \\ ప్రత్యామ్న్యాయం లేదా ?
మొదలైంది కాళేశ్వరం తిప్పిపోత
*********************
👉ఇప్పటివరకూ సుమారు 30కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం నుండి ఎత్తిపోసిన నీటిని గేట్లుఎత్తి కిందికి తిప్పిపోసే కార్యక్రమం మొదలైంది.
👉 ఎత్తిపోసిన నీటిని తిరిగి తిప్పిపోసిన సంఘటన చరిత్రలో ఎక్కడా జరిగుండదు.
👉 30కోట్లు అంటే మనోళ్ళకు లెక్క ఉండకపోవచ్చు. కానీ వేలకోట్ల రూపాయలు పెట్టి వృధాగా కట్టిన ఆనకట్టలు, పంప్ హౌజ్ లు, కాలువలు…వీటిమాటమిటి?
👉 భారీ కట్టడాలు చూపించి ఒక భారీ ఇంజనీరింగ్ తప్పిదాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా చూపే ప్రయత్నం మొదటి ఏడే బెడిసి కొట్టింది…
👉ఇప్పుడు మెడిగడ్డ వద్ద చూస్తున్న నీరంతా తుమ్మిడిహట్టిని దాటి వచ్చిందే…కనీస ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉన్నా మహారాష్ట్ర ఒప్పుకున్న 148మీటర్ల ఎత్తునుండే నేరుగా నీటిని కేవలం 150మెగావాట్ల పంపులతో తరలించవచ్చు. దారిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా నీరందించవచ్చు…
👉ఇప్పటికే కట్టిన కాళేశ్వరం బ్యారేజీలను నీటి నిల్వకు, చేపల పెంపకానికి, పర్యాటకానికి ఉపయోగించవచ్చు…వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుంది…
👉చుక్కనీరు ఎత్తిపోయకుండా, నీరు గ్రావిటీ ద్వారా ఎలా సుందిళ్లకు తీసుకురావచ్చో ఇప్పటికే టీజేఏసీ సోదాహరణంగా వివరించింది. ప్రత్యామ్నాయం లేదంటూ చేస్తున్న ప్రచారాలలో డొల్లతనం ఇందులో బట్టబయలవుతుంది…
తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని, స్టోరేజి తక్కువని, మహారాష్ట్ర ఒప్పుకోలేదనీ, మహారాష్ట్రలో ముంపు ఉంటుందనీ, మేడిగడ్డ వద్ద నీటి లభ్యత, స్టోరేజి ఎక్కువనీ…సెంట్రల్ వాటర్ కమిషన్ మెడిగడ్డను సమర్ధించిందనీ…చేసిన ప్రచారాలకు సమాధానం కోసం…వాస్తవాలను తెలుసుకోవడం కోసం…
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భారీ ఇంజనీరింగ్ తప్పిదం…ఈ ప్రాజెక్టు “ఎత్తిపోతల కాదు, ఒక తిప్పిపోతల” ఎలాగో తెలుసుకోవాలంటే సమగ్ర విశ్లేషణ కోసం… వీడియో…
కాళేశ్వరం ప్రాజెక్టు – ఎత్తిపోతల కాదు తిప్పిపోతల పథకం – చరిత్రలోనే అతి పెద్ద ఇంజనీరింగ్ తప్పిదం