జానారెడ్డి ప్రెస్ మీట్

బంజారాహిల్స్ లోని జానారెడ్డి గారి నివాసం నుండి …మీడియా సమావేశం..

మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి గారి కామెంట్స్* సీఎం కేసీఆర్ సభలో 2014 ,18 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గుర్తు చేస్తున్నాను..

* కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు గా ఎం చేసింది, ఎం చేయలేదు అని టీఆరెస్ ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు..

* ఉమ్మడి రాష్ట్రంలో ,దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కులమతాలకు అతితంగా అభివృద్ధి చేసింది..

* ఎన్నో పరిశ్రమలు స్థాపించి లక్షలాదిమంది కి ఉపాధి కల్పించారు..

* కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధించిన అభివృద్ధి ద్వారా అందుతున్న ఫలాలు ,ఆదాయాన్ని పంచిపెడుతున్నారు..

* మెట్రో , BHEL, హైవే లు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నే సాధించాం..

* దేశంలోనే ఉచిత కరెంట్ ను ప్రారంభించింది ,కరెంట్ బకాయిలను మాఫీ చేసింది కాంగ్రెస్..

* ఆరోగ్యశ్రీ, ఉపాధిహామీ , రూపాయకి కిలో బియ్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ..

* తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 70 వేల కోట్లు మాత్రమే అప్పు ఉంది అది 70 సంవత్సరాల పరిపాలన లో..

* మీరు ఈ 6 సంవత్సరాల కాలం లో మూడున్నర లక్షల కోట్ల అప్పు చేశారు..
కాంగ్రెస్ అభివృద్ధి ని ఎప్పుడైనా మెచ్చుకున్నారా…?

* రైతు బంధు ద్వారా రైతులకు అందుతున్న సహాయం అభినందిస్తున్న ..కానీ రుణమాఫీ చేస్తా అని ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలుగా అమలు కాకపోవడం వల్ల రైతులు వడ్డీ కట్టవలిసి వస్తుంది..

* కళ్యాణాలక్ష్మి పథకాన్ని మేము తీసుకువచ్చిన బంగారు తల్లి పథకాన్ని కొనసాగుస్తున్నరు..

* తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ ..కానీ ఎప్పుడైనా అభినందించారా..?

* ప్రధాన ప్రతిపక్షం గా మిమ్మల్ని నిలదీయడం మా విధి..

* దళితులకు 3 ఎకరాల భూమి ,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ,రుణమాఫీ మీ దగ్గర ప్రజలు ఆశించారు..ఏ ఒక్కటి నెరవేర్చలేదు..

* కాంగ్రెస్ పార్టీ హయాంలో 33 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఆసైన్డ్ ,సీలింగ్ భూములను రైతులకు పంచింది..

* ఒక నల్గొండ జిల్లా లోనే రెండు లక్షల ఎకరాల భూమి పంచాం..

* 2 లక్షల 72 వేల ఇల్లు మంజూరు చేసాం అన్నారు ఒక ఇల్లు అయిన పూర్తి చేసారా..

* నేను చెప్పింది తప్పు అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటేయకండి అని హాలియా సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు..
ప్రజలే నిర్ణయిస్తారు..

* మిషన్ భగీరథ నీళ్లు ఇంకా చాలా ఊర్లకి రావడం లేదు..

* మా హయాంలో ఒక ఇందిరమ్మ పథకం ద్వారానే 25 లక్షల ఇల్లు నిర్మించాం..

* 2500 కోట్లు హుజూర్ నగర ,దెవరకొండ ,మిర్యాలగూడ ప్రాజెక్టులకు ఇస్తే అందులో 75 కోట్లు మాత్రమే నాగార్జున సాగర్ కు కేటాయించారు..

* నేను మంత్రి అయిన తరువాత 4 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరందించా..

* లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను విస్మరిస్తున్నారు..

* జానారెడ్డి తో డిబేట్ కి టీఆరెస్ నుండి ఎవరైనా సరిపోతారా..?

* ప్రజలే జానారెడ్డి తరుపున డిబేట్ నిర్వహించాలి…

* నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ లో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది..

* శ్రీశైలం ఎడమ కాలువను సమీక్షించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

దీని ద్వారా సంవత్సరం కి 250 కోట్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది..

నాగార్జున సాగర్ కి ఏమి చేయలేదని జానారెడ్డిని అనే హక్కు ..అర్హత ఎవరికైనా ఉందా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *