వరి రైతుల గోస తీర్చాలి: తెలంగాణ జన సమితి

ఎన్నికలు రాగానే రైతే రాజు దేశానికి వెన్నుముక రైతు అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొదటి నుంచి రైతులపై కక్షా పూరింతగానే వ్యవహరిస్తున్నారు. పండించిన పంటకు రైతే ధర నిర్ణయించాలన్న ముఖ్యమంత్రి… కనీసం వారు పండించిన పంటను అమ్ముకోలేని దీనస్థితికి తీసుకొచ్చారు. రైతు పండించిన వరి కోసం ఐకేపీ కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడం, వ్యవసాయ మార్కెట్ల వద్ద వరి పంటను కొనకపోవడంతో రైతులు రోడ్లపై పడిగాపులు కాసేలా చేస్తొంది టీఆర్ఎస్ సర్కారు. ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల వల్ల కనీసం మిల్లుల వద్దనైనా అమ్ముకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అక్కడ కూడా టోకెన్ల అందక పోవడంతో పండించిన ధాన్యం పాడైపోయి రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ వింత చర్యల కారణంగా వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది. వరి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తోంది.

నియంత్రణ సాగు పేరుతో సన్నా ధాన్యాలను పండించాలని రైతులకు చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ వారు క్యూలైన్లలో టోకెన్ల కోసం నిలబడాల్సిన పరిస్థితికి తీసుకువచ్చారు. తొల్లవారుజామున నుంచే టోకెన్ల కోసం రైతులు వ్యవసాయ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన దీనస్థితికి రైతులను ప్రభుత్వం దిగజార్చింది. నియంత్రిత సాగు విధానంతో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసిన కేసీఆర్ ప్రభుత్వం వెంటనే రైతులకు క్షమాపణలు చెప్పి బాధ్యత వహించాలి. సన్నాలు పండించండి దానికి మద్దతు ధర నేను కల్పిస్తాను అని చిలకు పలుకులు పలికిన ముఖ్యమంత్రి ఇవాళ ఎందుకు మొహం చాటేస్తున్నారో రైతులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు నెట్టుకుంటూ రైతులను పట్టించుకోవడంలేదు. రాజకీయలబ్ధీ కోసమే రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. చిత్తశుద్ధితో ప్రభుత్వాలు వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *