భారతీయ రైల్వేకి కరోనా వలన గట్టి దెబ్బ….. !

కరోనా ప్రభావం ప్రజలను మరియు ఆర్థిక వ్యవస్థలను భయపెడుతూనే ఉంది. పక్కనే ఉన్న చైనాలో విజృంభించిన కరోనా, భారత్ లో పెద్దగా ప్రభావం చూపలేదు అని అనుకుంటున్న దశలో భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో దేశం మొత్తం కంగారు పడుతుంది.ఇక అసలు విషయానికి వద్దాం… 165 ఏళ్ల చరిత్ర ఉన్న భారతీయ రైల్వే వ్యవస్థ, దేశంలో రవాణా రంగంలో ఎంతో కీలకమైనది. కరోనా ప్రభావంతో విమానయానా రంగం కుదేలైన నేపథ్యంలో, భారతీయ రైల్వే వ్యవస్థకు కాస్త ప్లస్ అవుంతుందని అంతా అనుకున్నారు. కానీ భారత్ లో కరోనా కేసులు పెరుగుతు ఉండటంతో కరోనా ప్రభావం రైల్వే వ్యవస్థపై పడింది. ఇప్పటికే పదుల సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.

దాదాపు 40 రైళ్లు పూర్తిగా రద్దు కాగా………. 40 శాతం మేరకు రైల్వే ప్రయాణికులు తగ్గారని గణంకాలు చెబుతున్నాయి. ఇలాంటి స్థితి, గతంలో ఎప్పుడు లేదని, దేశ వ్యాప్తంగా వరదలు ముంచెత్తిన సమయంలో కూడా రైల్వే ఇంత ప్రభావానికి గురి అవ్వలేదని తెలుస్తుంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు దేశంలోని ముఖ్యమైన 250 స్టేషన్లలో ప్లాట్ ఫామ్ ధరలను రాష్ట్రాల తో పాటు కేంద్రం కూడా పెంచేసింది. అయితే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడానికి కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు కూడా కారణమని, కరోనా వైరస్ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి అని సూచించటంతో చాలా మంది ప్రయాణికులు ముందు జాగ్రత్త చర్యగా వెనుకడుగు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *