చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అరెస్టు.

తమ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, తమ హక్కుల సాధన కోసం దీక్షకు దొగున చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని వికారాబాద్ పోలీసులు అరెస్టు చేసారు.

 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రావలసిన నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తలపెట్టిన దీక్ష భగ్నం అయింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు వికారాబాద్ లో నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.

కాకపోతే ప్రభుత్వం నుండి ఈ దీక్షకు పర్మిషన్ లభించలేదు. అయినా కూడా కాంగ్రెస్ నేతల మద్ధతుతో చెప్పిన సమయానికే దీక్ష ప్రారంభించారు. కానీ ప్రారంభమైన కొద్ది సమయానికే వికారాబాద్ డీఎస్పీ శిరీష సహా కొంత మంది పోలీసులు దీక్షా స్థలికి చేరుకున్నారు.

దీక్ష విరమించి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డీఎస్పీ కోరగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ససేమిరా అనడంతో బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్ళారు. ఈ తరుణంలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ అరెస్టుతో వికారాబాద్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా వెళ్తామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *