కొడంగ‌ల్ పై టీవీ9 బోగ‌స్ స‌ర్వే… త్వ‌ర‌లో. రేవంత్ కు ఓట‌మి త‌ప్ప‌ద‌నే గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణ‌మే ఎజెండా

కొడంగ‌ల్ లో రేవంత్ కు క‌ష్ట‌కాల‌మే ఉంది. ఆయ‌న‌పై టీఆర్ఎస్ అబ్య‌ర్థి న‌రేంద‌ర్ రెడ్డి భారీ మెజారిటీతో గెల‌వ‌బోతున్నారు. రేవంత్ పై స్థానిక ప్ర‌జానీకం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు, ఆయ‌న స్థానిక ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేదు. ఇదీ త్వ‌ర‌లో టీవీ9లో రాబోయే ఓ క‌థ‌నం.

TV5 News
గ్రౌండ్ రిపోర్టు పేరుతో… టీవీ9 ప్ర‌తినిధి రాకేష్ ఈ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ చేస్తున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇటీవ‌లే టీవీ9 సంస్థ చేతులు మారింది. మైహోం అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు టీవీ9ను కొనుగోలు చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. మైహోం అధినేత‌కు, టీఆర్ఎస్ కు ఉన్న చెలిమి అంతా ఇంతా కాదు. బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఇటు కేసీఆర్ కు , అటు రామేశ్వ‌ర్ రావు కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై ఓ ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టేందుకు టీవీ9 పేరుతో ఓ కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టారు.

కొడంగ‌ల్ లో జ‌నం ఎవ‌రివైపు ఉన్నారు, అక్క‌డ స్థానిక స‌మ‌స్య‌లెంటీ… ఇంత‌వ‌ర‌కు పాలించిన పాల‌కులు ఎంత‌వ‌ర‌కు ప‌నులు చేశారు, ఏ పార్టీ ప‌నితీరు ఎలా ఉంది, ఎవ‌రికి ఓటు వేయ‌బోతున్నారు ఇలాంటి ప్ర‌శ్నావ‌ళితో… త‌మ‌కు అనుకూలంగా కొంత‌మంది స్థానిక నేత‌ల‌తో, ప్ర‌జానీకంతో… రేవంత్ గ్రాఫ్ బాగా త‌గ్గిపోయింద‌ని, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి గెలుపు ఖాయ‌మ‌ని ప్ర‌చారం చేయ‌బోతున్నారు. దీనికి గ్రౌండ్ రిపోర్ట్ అనే పేరుతో… త‌న ప్ర‌తినిధిని కొడంగ‌ల్ కు పంపింది యాజ‌మాన్యం. ఈ కార్య‌క్ర‌మం అతి త్వ‌ర‌లోనే ప్రసారం కాబోతుంది.

కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. కానీ ఏ నియోజ‌క‌వ‌ర్గం అయినా… కొంద‌రు వ్య‌తిరేకించే వారు కూడా ఉండ‌టం స‌హజం. ఇప్పుడు వారితోనే మాట్లాడించి, ఇక ఇక్క‌డ రేవంత్ గెల‌వ‌డు… ఇంట గెల‌వ‌ని వాడు, ర‌చ్చ ఎలా గెలుస్తాడు అన్న చందంగా ప్రొజెక్టు చేయ‌బోతున్నారు. త‌ద్వారా… రేవంత్ ను, ఆయ‌న టీం ను గంద‌రగోళ ప‌ర్చే ఉద్దేశంతో పాటు… రేవంత్ కొడంగ‌ల్ దాటి ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్ల‌కుండా చేసే ఎత్తుగ‌డ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే, ముందే విష‌యం పొక్కింది. టీఆర్ఎస్ అతి త్వ‌ర‌లోనే ముఖ్య‌మైన కాంగ్రెస్ నేత‌లు ఉన్న చోట ఇలాంటి జిమ్మిక్కులు చేయ‌బోతుంద‌ని, వారిలో కూడా కీల‌కమైన వ్య‌క్తి కావ‌టంతోనే రేవంత్ ను ముందు టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. ఇక‌, ఇప్ప‌టికే… తెలంగాణ‌లో ఉన్న మెయిన్ స్ట్రీం మీడియా కేసీఆర్, టీఆర్ఎస్ అనునాయుల చేతిలోకి వెళ్లిపోయింది. టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తోన్న మీడియాను ఇప్ప‌టికే కేసీఆర్, ఆయ‌న టీం కొనేసింది. అందుకే కొంత కాలంగా మెయిన్ స్ట్రీం మీడియాలో ఎక్క‌డా ప్రభుత్వ‌, టీఆర్ఎస్ వ్య‌తిరేక‌త వార్త‌లు రావ‌టం లేదు. వీట‌న్నింటికి సోష‌ల్ మీడియానే వేధికైంది.

అయితే… ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌, గ్రౌండ్ రిపోర్టుల పేరుతో, ప్ర‌జ‌ల్లో… ఓట‌ర్ల‌లో అనేక గంద‌రగోళం నింపేందుకు ప్ర‌య‌త్నించే వాటిని ప్ర‌సారం చేయ‌రాద‌ని ఈసీ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసినా, అలాంటి వార్త‌లు మాత్రం ఆగ‌టం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *