రాజ్ భవన్ ను TRS భవన్ అంటారేమో // గవర్నర్ పై భట్టి విక్రమార్క సెటైర్స్

గాంధీ భవన్:

*భట్టి విక్రమార్క:*
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్:*

రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ ఉమ్మడి కరీంనగర్ లో మాట్లాడిన మాటలు గవర్నర్ హోదాను, పదవిని కించపరిచినట్లున్నాయి.

ఒక పార్టీ, ప్రభుత్వం పై స్థాయి మరచి మాట్లాడారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుమీద పెట్టిన ప్రాజెక్టు ను సందర్శించేందుకు వెళ్లి…ఆ పేరును ఎందుకు తీసేశారని ప్రశ్నించక పోవడం విచారకరం.

అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను అప్పటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ప్రారంభించారు.

38వేల 500 కోట్ల ప్రారంభమైన ప్రాజెక్టు లో అప్పటికే 10వేలు ఖర్చుచేశారు. ఇప్పుడు కేవలం కాళేశ్వరం గా పేరు మార్చి 80వేల 500కోట్లకు పెంచారు.

50వేల కోట్లు వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని అడగాల్సిన గవర్నర్ ఆహా ఓహో అని పొగిడారు.

సీఎం కెసిఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖర రావు అని, హరీష్ రావు ను కాళేశ్వర రావు అని గవర్నర్ అభివర్ణించారు.

*ఇవన్నీ చూస్తుంటే రేపు రాజ్ భవన్ ను trs భవన్ అంటారేమో అని బాధకల్గుతుంది.*

ప్రాణహిత ప్రాజెక్టు ను జాతీయ ప్రాజెక్టు చేస్తే ఒక్క రూపాయి కూడా కర్చులేకుండా కాళేశ్వరం పూర్తయ్యేది.

ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల పేర్లు మర్చి…సీతారామ ప్రాజెక్టు గా మర్చి…10వేల కోట్లు అదనంగా పెంచారు.

ఈ ప్రాజెక్టుల్లో జరిగిన టెండర్ల లో పెరిగిన వాటిని ప్యాకేజ్ వారిగా రాజ్ భవన్ కు పిలిచి రివ్యూ చేయండి. అది మీ బాధ్యత.

అలా చేయకుంటే మేం ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రపతిని కలుస్తాం… గవర్నర్ పాత్ర పై పిర్యాదుచేస్తాం.

ఇతర పార్టీల వారిని trs మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి రాజ్యాంగాన్ని అవమానపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *