ఎమ్మెల్యేగా ఎలా ప్ర‌మాణం చేయాలి, బండ్ల గ‌ణేష్ రిహ‌ర్స‌ల్స్

ప్ర‌ముఖ సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్ మరోసారి వివాద‌స్ప‌ద వాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీలో చేరిన అయినా, షాద్ న‌గ‌ర్ నుండి టికెట్ పై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఖ‌చ్చితంగా… ఈసారి అసెంబ్లీలో అడుగుపెడుతానంటూ…. ప్ర‌మాణ‌స్వీకారం ఎలా చేయాలో రిహ‌ర్స‌ల్స్ కూడా పూర్తిచేశారు.

Bandla Ganesh Politial

బండ్ల గ‌ణేష్ అనే నేను అంటూ… ఆయ‌న చేసిన రిహార్స‌ల్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్లు ఉంది క‌దా అని కొంద‌రు సెటైర్స్ వేస్తుంటే, ఆయ‌న కాన్ఫిడెన్స్ ను ఒప్పుకోవ‌చ్చు అంటూ… మ‌రికొంత‌మంది నెటిజ‌న్స్ వెన‌కేసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే… సిని నిర్మాత‌గా బండ్ల గ‌ణేష్ ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారో చెప్పి, చెప్ప‌న‌ట్లుగా చెప్పారు.

ఒక్కోసారి… అటు ఇటుగా అంకెలు అవుతూనే ఉంటాయ‌ని చెబుతూనే, నేను ఇప్పుడు రాజ‌కీయ నేత‌ను అంటూ త‌న‌ని తాను స‌ర్ధిచెప్పుకున్నారు. ఇక బండ్ల‌గ‌ణేష్ త‌న గురువులుగా, దైవంగా బావించే బొత్స‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌ను సంప్ర‌దించ‌లేద‌న‌టం కూడా వైర‌ల్ అవుతోంది. బండ్ల గ‌ణేష్ ఎం మాట్లాడిన‌, చేసినా… వీరిద్ద‌రు పేర్లు తీయ‌కుండా ఏదీ చేయ‌రు. అలాంటిది వారిద్ద‌రు రాజ‌కీయాల్లో పెద్ద నాయ‌కులు. వారిని కాద‌ని బండ్ల గ‌ణేష్ కాంగ్రెస్ లోకి ఎలా వ‌చ్చార‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఇక త‌ను రాజ‌కీయాల్లోకి రావ‌టం ఎవ‌రికీ ఇష్టం లేద‌ని, త‌న తండ్రి, అన్న‌ల‌కు అస‌లే లేద‌న్న ఆయ‌న‌… ప‌వ‌ర్, బొత్స‌ల‌కు అస‌లే చెప్ప‌లేద‌న‌టంపై ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *