కేసీఆర్ కు షాక్, ఆందోళ్ లో కేసీఆర్ కు సింగూరు నీళ్ల నిరసన సెగలు… బిగ్ బ్రేకింగ్
కేసీఆర్… ఆందోళ్ ప్రచారంలో ఊహించని విధంగా, ఆయన పర్యటనకు ముందు… అక్కడి స్థానిక నేతలు దర్నాకు దిగారు. సింగూరు నీళ్లు అక్రమ తరలింపు మరియు అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ ,వట్పల్లి మండలాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా సింగూరు నీళ్లు అందించాలంటూ… కేసీఆర్ గో బ్యాక్ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు.
సింగూరు జలాల సాధన సమితి ఆధ్వర్యంలో అల్లాదుర్గం గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి అకోలా నాందేడ్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఇదే కెసిఆర్ అందోల్ సభలో ఈ ప్రాంత రైతులకు అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తానని అన్నాడు. 4 సంవత్సరాల కాలంలో గుంటకు కూడా నీళ్ళు అందించకపోగా… వున్నా17 టీఎంసీల నీళ్ళను ఇతర జిల్లాలకు అక్రమంగా తరలించుక పోయిండని మండిపడ్డారు. ఈ ఘనత మాత్రం కేసీఆర్ దే అంటూ ఎద్దేవా చేశారు సింగూరు జలాల సాధన సమితి నేతలు. ఈ ప్రాంత రైతుల పొలాలు ఎండగొట్టి నోట్లో మట్టికొట్టి భూగర్భ జలాలు అడుగంటి పోయే విధంగా చుక్క నీరు లేకుండా సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీలో ఉంచడంతో…. గత 56 సంవత్సరాల కాలంలోఎన్నడూ లేనంత దయనీయ స్థితికి వెళ్లిపోయామని ఆవేధన వ్యక్తం చేశారు.
ఉన్న జలాలను తరలించుకపోయి… ఇప్పుడు మళ్లీ ఓట్లడిగేందుకు వచ్చారని, కేసీఆర్ ను ఓడిస్తేనే ఇక్కడి ప్రజలకు న్యాయం జరగుతుందని తెలిపారు సింగూరు జలాల సాధన సమితి నేతలు.