‘ఈటె’ల దిగలేదు…

అందరికి తెల్సిన విషయాలే ఈటెల చెప్పారు. ఈటెల ఎందుకో గట్టిగానే భయపడుతున్నాడు అని అర్థం అవుతుంది.
అది బానిస భవన్ అని, పార్టీలో కుటుంబానికి తప్ప ఎవరికి వాల్యూ లేదని, మంత్రులు ఉత్సవ విగ్రహాలే అని మన అందరికి తెల్సిన విషయాలే. కొత్త విషయాలు చెప్పి ‘ఈటె’ దింపుతాడు అని గట్టిగానే అనుకున్నాం..కానీ కుదరలేదు..

2014 లో ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు జీతాలు ఇవ్వాలంటే #మందు అమ్మితే తప్ప ఇవ్వలేని స్థితికి ఎందుకు వచ్చిందో చెప్పాల్సింది..

తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు 40 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏటా 10 వేల కోట్ల విద్యుత్ బిల్లులతో లక్ష కోట్లు ఎందుకు దాటాల్సి వచ్చిందో, ఎవరి స్వార్థం దీని వెనకాల ఉందొ చెప్పాల్సింది…

40 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేబట్టిన మిషన్ భగీరథ మొదటి చైర్మన్ ఎందుకు దిగిపోయి ఆ ప్రాజెక్ట్ ని అటకెక్కిచ్చింది ఎందుకో చెప్పాల్సింది..

ధరణి వెనకాల జరిగిన కుట్రలు చెప్పాల్సింది. సాటి బడుగు, బలహీన వర్గాలు సాగుదారులుగా ఉన్న భూములు దొరల వశం ఎందుకయ్యాయో చెప్పాల్సింది..

తెలంగాణ లో నెలకు 50 వేలు సంపాదించే ఒక వ్యక్తి పట్టణాల్లో ఇల్లు కొనుక్కోవాలి అంటే జీవితం తాకట్టు పెట్టాల్సి వచ్చేంతగా భూముల రేట్లు పెరగడానికి కారణాలు ఏవో చెప్పాల్సింది..

యాదాద్రి పేరున కవిత జరిపిన భూముల స్కామ్ ల తో పాటు కొంగరకలాన్, తెల్లాపూర్ లో కొల్లగొట్టిన భూముల గురించి చెప్పాల్సింది…

ఈటెల మొత్తం ఎపిసోడ్ చూస్తే నాకు దోపిడీలో కొంచెం వాటా ఇస్తే బయటకు వచ్చే వాడిని కాదు కదా…. ? లేక నేను ఒక్కడినే దోచుకుంటున్నాన కెసిఆర్ ఫ్యామిలీ దోచుకోవడం లేదా… అన్నట్టు ఉంది.

ఇక బీజేపీ కి ఎందుకు వెళ్తున్నారో ఇప్పటికే ప్రజలందరికీ అర్థం అయింది.

Post By : Chandra Shekhar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *