గ్రామంలో ఆ రాజకీయ పార్టీ బహిష్కరణ……!
ఊరు ఊరంతటికి ఓ రాజకీయ పార్టీ నచ్చలేదు. అవును మీరు చిదివింది నిజమే. నిజామాబ్ద్ జిల్లాలో ఓ గ్రామం అధికార టీఆర్ ఎస్ పార్టీని పూర్తిగా భహిష్కరించింది. జిల్లాలోని కమ్మర్ పల్లి మండలం ఉఫ్లూర్ గ్రామంలో చాలా రోజులుగా సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.
దీంతో తమ పంట పొలాలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి లీక్ అయి వృధాగా పోతున్న నీళ్లను ఇవ్వమని గ్రామస్తులంతా మంత్రి హరీష్ రావు, ఎంపీ కవితను వేడుకున్నారు. అయితే గ్రామస్థుల మొరను వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఉఫ్లూర్ గ్రామంలోని పలువురు రైతులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామ కమిటి టీఆర్ ఎస్ పార్టీని భహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.
ఇకపై టీఆర్ ఎస్ పార్టీ సమావేశాలకు, సభలకు వెళ్లకూడదని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వకూడదని తీర్మాణం చేసుకున్నారు ఉఫ్లూర్ గ్రామస్థులు.