రైతు బంధు పథకం ఇలాగే కొనసాగితే మరో రైతాంగ సాయుధ పోరాటం తప్పదా ?
తలకాయ లేనోనికే ఈ స్కాం లు అర్దం కావు…
మట్టి బుర్ర పెట్టుకొని చెత్త వాగుడు పెట్టకిక్కడ..
ఆ బుర్రల ఇంత గుజ్జుంటే ఆ దొర గల్లా పట్టుకొని అడుగు …????
ఆ నాటకం పేరేంటో???
అండ్ల నీకు వెర్రి బాబులోడి పాత్ర ఎందుకిచ్చిండో???
భూస్వామి అంటే ఎవడు???
వానికి రైతు బంధం ల ఎకరానికి 8000 ముట్టినై… మల్ల గదే భూమి కౌలుకిస్తే ఎకరానికి మల్ల 15000 ముట్టినై…..
వాడు పట్నంలనే ఉన్నడు, కాలు మీద కాలేసుకునే ఉన్నడు , పైసలు మాత్రం జేబుల జోర్రినై???
అయినా తప్పాయినది కాదే.!!
చిన్న పెద్ద అందరకిస్తన్నం అని డప్పేసుకున్నంక అయినా ఎందుకొదులుకోవాలే???
కానీ సారు దృష్టిల కాడెద్దులు లేకుండా దున్నే పెద్ద రైతైండు ఆయన…
రెక్కలు ముక్కలు చేసుకుని, రక్తం ఆవిరి చేసి ఎండిన బొక్కలతో , ఎముకల గూడేసుకొని తిరుగుతండు ఈ రోజు కౌలు రైతు, ఎముకల్ని సైతం బస్మం చేస్తుంది ఈ రోజు నీ రాచరికపు రైతు బంధం..
70% పైగా ఆత్మహత్యలు కౌలు రైతులవి అయినప్పుడు ???
నీ రైతు బంధం వాళ్లకు ఎందుకు లేదు???
పెరిగిన కౌలు నీ మనవడు కడతడా???
ఇదే పోకడ కొనసాగితే ఆర్థిక అసమానతలు చేదించలేని అంతరంగా మారే ప్రమాదము లేకపోలేదు…
నీ ఆటలు పెచ్చు మీరిపోతున్నై…ఈ రాష్ట్ర ప్రత్యామ్నాయ నాయకత్వ లోపం నీకు ఈ రోజు వరమైంది???
అహంకారం అణచడానికి, నీ దోపిడీ ముసుగు తొలగించడానికి మరెన్నో రోజులు పట్టదు..
ఎంత పెద్ద గడీ అయిన కార్మికులే కడుతారు, మరెంత పెద్ద గడీ అయినా కార్మికులే కూలుస్తరు.
By Priyankar