గవర్నర్ గారూ వారు కాళేశ్వర రావులు కాదు తెలంగాణ ను కాటేస్తున్న కాటేశ్వర రావులు.

గవర్నర్ పదవిని కించపరిచారు.
ప్రభుత్వం వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తయినా, పాలమూరు లో నిర్మాణం లో ఉన్న నెట్టెంపాడు, కల్వకుర్తి,భీమా మరియు కోయిలసాగర్ ప్రాజెక్ట్ లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 90% పూర్తయినా ఈ ప్రభుత్వం ఇంకా ఎందుకు పూర్తి చేయలేదో అడుగుదాం , పర్యటనకు రండి గవర్నర్ గారూ..

వాళ్ళు కాళేశ్వర్ రావులు కాదు, కాటేశ్వర్ రావులు, కమీషన్ల రావులు

Telangana congress leader

ప్రాణహిత ప్రాణం తీసిన్రు.. పాలమూరును పరేషాన్ చేసిండ్రు…. డి.కె అరుణ.

రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి ప్రజలకు రక్షణగా, రాష్ట్రానికి రాజ్యాంగ పరిరక్షణగా ఉండాల్సిన గవర్నర్ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కాళేశ్వర చంద్రశేఖర్ రావు, హరీష్ రావుని కాళేశ్వరరావు అని పొగడడం గవర్నర్ పదవిని కించపరిచే విధంగా ఉంది.

గవర్నర్ తన బాధ్యతను విస్మరించి, ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా పాలకుల మెప్పు కోసం పాకులాడుతున్నట్టుంది.

ప్రాణహిత ప్రాజెక్టుకు పునాది వేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం.
గోదావరి జలాలను ఉత్తర, దక్షిణ తెలంగాణకు అందించాలనే లక్ష్యంతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది.

38 వేల కోట్ల రూపాయలతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు, హైద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు అందించే బహుళార్ధక
ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడ కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది.

కాని ఈ ప్రభుత్వం కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టు డిజైన్లు మార్చి, పేరు మార్చి, వేల కోట్లకు అంచనాలు పెంచి, రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసి వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల మీద మోపి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు మీద ఉన్న ఈ ప్రాజెక్టు పేరు మార్చి మోసం చేస్తుంటే, నాటి నుండి నేటి వరకు ప్రత్యక్ష సాక్షిగా అన్నీ తెలిసిన గవర్నర్ ఈ విధంగా మాట్లాడడం శోచనీయం.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 వేల కోట్లు అప్పటికే వ్యయం చేసింది, జాతీయ ప్రాజెక్టు అయితే కొత్త ర్రాష్ట్రం మీద ఒక్క పైసా భారం పడకుండా ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి అయ్యేది.

పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టును ముందు పెట్టి, ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లా ఆయకట్టును తొలగించి కొత్త సమస్యలకు , వివాదాలకు తెర లేపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ను 81 వేల కోట్లకు పెంచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు వేలాది కోట్లు దోచిపెట్టి కమిషన్లు దోచుకున్నారు.

భూ సేకరణలో రైతులను అణచివేసి అక్రమంగా ఆక్రమించారు.

ఇలా అన్ని రకాల చట్ట, రాజ్యాంగ వ్యతిరేకంగా, రైతు, ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్న కేసీఆర్ మీకు దేవుడిలా కనిపించారా..?

గవర్నర్ గారూ వారు కాళేశ్వర రావులు కాదు తెలంగాణ ను కాటేస్తున్న కాటేశ్వర రావులు. దయచేసి గ్రహించాలని, తెలంగాణను కాపాడాలని గవర్నర్ గారిని కోరుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *