Polytricks.in

హైదరాబాద్‌ను డ్రగ్స్‌ అడ్డాగా మార్చిందెవరు? తెరపైకి మరోసారి రకుల్‌ప్రీత్‌ సోదరుడు..

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తున్నది. ఎడ్యుకేషన్‌, హెల్త్ రంగాల్లో ఇతర రాష్ట్రాలు వాళ్లు హైదరాబాద్‌కు వచ్చే పరిస్థితి నుంచి డ్రగ్స్‌ కావాలంటే హైదరాబాద్‌కు రావాలి అన్నట్లు తయారు చేశారు గత పాలకులు. పదేళ్లలో విచ్చలవిడిగా నగరంలో డ్రగ్స్‌ భూతాన్ని పెంచి పోషించారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందినవారు డ్రగ్స్‌ కేసుల్లో తరచూ పట్టుబడుతున్నారు. తాజాగా రకుల్‌ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ ప్రీత్ సింగ్ పేరు మరోసారి డ్రగ్స్ కేసులో తెరమీదకు వచ్చింది. గతంలో కూడా అమన్ ప్రీత్ సింగ్‌పై డ్రగ్స్ కేసు ఉంది.

డ్రగ్స్ కేసులో గతంలో చాలామంది టాలీవుడ్‌ వ్యక్తులు విచారణను ఎదుర్కున్నారు. పదేళ్లలోనే డ్రగ్స్‌ విచ్చలవిడిగా రవాణా, వాడకం పెరిగినట్లు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే టాలీవుడ్‌కు ఈ డ్రగ్స్‌ ను అలవాటు చేయడం వెనుక నాటి ప్రభుత్వంలో రెండోస్థానంలో ఉన్న మాజీ మంత్రి హస్తం ఉందని చాలా మంది అంటున్నారు. తన పరిచయాలు, సరదాలు, పార్టీల కోసం టాలీవుడ్‌ నటులతో కలిసి తిరిగిన సదరునేత..తన వ్యాపారం కోసం టాలీవుడ్‌కు డ్రగ్స్ అంటగట్టారని పలువురు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల చెప్తున్నారు. అప్పట్లో ఆయన సరదా కోసం మొదలైన డ్రగ్స్‌ …ఆ తర్వాత టాలీవుడ్ మొత్తానికి పాకింది. ప్రస్తుత ప్రభుత్వం ఈగల్ టీమ్స్‌లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో డ్రగ్స్ రవాణా, వాడకం తగ్గిపోయింది. కానీ గత పాలకులకు సంబంధించిన పలువురు వ్యక్తులు తరచూ పట్టుబడుతూనే ఉన్నారు.

తాజాగా మాసబ్‌ట్యాంక్ పోలీసులు సహా తెలంగాణ ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్, ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారవేత్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారని, అందులో ఒకరు టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అని తేలింది. అతను ఈ వ్యాపారుల దగ్గర రెగ్యులర్ గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుల నుంచి 43 గ్రాముల కొకైన్ మరియు ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా, పరారీలో ఉన్న హీరోయిన్ సోదరుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రత్యేకంగా రంగంలోకి దిగిన ఈగల్ టీం, మాసబ్‌ట్యాంక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

టాలీవుడ్‌లో గతంలోనూ పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోగా, మళ్ళీ ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ సొంత తమ్ముడి పేరు వినిపించడం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత సంవత్సరం కూడా సైబరాబాద్ పోలీసులకు పట్టుబడిన అతను ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని సమాచారం.

Exit mobile version