Site icon Polytricks.in

‘బలగం’ సినిమా మీద పోలీస్ కేసు?

చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ సినిమా బలం పుంజుకుని పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. దీని దర్శకుడు జబర్ దస్త్  నటుడు వేణు ఎల్దండి. అతని దర్శవత్వంలో కామెడీ సినిమా వస్తుంది అనుకున్నారు అందరు. కానీ సీరియస్ సినిమా తీసి తన సత్తాను చాటుకున్నాడు.

ఆ సినిమాకు దిల్ రాజు వారసులు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి లు నిర్మాతలు. ఈ సినిమా విడుదలప్పుడు ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమా మెల్లిగా హిట్ కాగానే ఒక్కసారిగా దీని మీద అందరి కన్నుపడింది.

అందుకే చాలా గ్రామాల్లల్లో ఈ సినిమాను పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. దీనివలన తమ ఆదాయం తగ్గిపోతుంది అని దిల్ రాజు నిజామాబాద్ ఎస్ పి కి పిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు సినిమాను దొంగ చాటుగా ప్రదర్శించి డబ్బులు దండుకుంటున్న వాళ్ళను అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేస్తున్నారు. సినిమా ఆడినా, ఆడకపోయినా నిర్మాతలకు కష్టాలు తప్పేలా లేవు సుమా.

Exit mobile version