Site icon Polytricks.in

ఓ వ్యక్తి హత్య కేసులో కోడిని అరెస్టు చేసిన పోలీసులు?

కాదేవరు అరెస్ట్ కు అనర్హులు అన్నట్లు ఉంది మన పోలీసుల పద్దతి. ఈరోజు పోలీసులు ఓ కోడిని హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. దానికి చేతులు లేవు కాబట్టి సంకెళ్ళు వేయలేదు. షర్ట్ వేసుకోలేదు కాబట్టి కాలర్ పట్టి గోర గోరా లాక్కు పోలేదు. అది మనిషి కంటే వేగంగా పరుగెత్తు తుంది కాబట్టి రోడ్డు మీద పరుగెత్తించి లాఠీతో కొట్టలేదు. సింపుల్ గా దానిని ఎత్తుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని తీసుకెళ్ళి లాక్ అప్లో వేశారు. అది ఊచల సందులోంచి పారిపోకుండా గంప కింద పెట్టారు. ఇంతకీ ఆ కోడి చేసిన నేరం ఏమిటో తెలుసా?

జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్కు చెందిన సత్తయ్య (45) ఆ కోడిని పెచుతున్నాడు. మూడు రోజుల కిందట జరిగిన కోళ్ళ పందెంలో దానిని బరిలోకి దింపాడు. అందరిలా ఆ కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున ఎగిరేసరికి ఆ కత్అతి తని పొట్టలో గుచ్చుకొని అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సత్తయ్య మృతికి కోడే కారణమని ఏ-వన్ ముద్దాయిగా అరెస్ట్ చేసారన్న మాటా.

దానిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక దానిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తన కూతలతో స్టేషన్ను హోరెత్తిస్తోంది ఆ కోడి. ఇంతకీ దాని పేరు ఎఫ్ఐఆర్లో ఎం రాశారో తెలియదు. బహుశా ‘కొక్కరొక్కో’ అని రాశి ఉంటారు. దాని తండ్రి పేరు కూడా సన్ అప్ ‘కొక్కరొక్కో 2’ అని రాశి ఉంటారు. ఆ కోడి తరపు లాయరు కోర్ట్ లో ఎలా వాదిస్తాడో చూడాలి. దానికి ఉరి శిక్షగా ‘చికెన్ బిర్యనిగా’ మారనుందో, ‘చికెన్ కర్రి’ లాగా మారనుందో వేచి చూడాలి.
౦౦౦

Exit mobile version