తెరాస పార్టీ ని నిలదీస్తే ఎవరైనా రామ గౌడ్ లాగానే బలి కావాల్సిందేనా..?

తెరాస సర్పంచ్ అవినీతి, భూ కబ్జా, MRO తప్పుడు ధ్రువీకరణ పత్రం, పోలీసుల తప్పుడు కేసులు, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం, దీనికి MLA వత్తాసు పలికి వెనకనుండి నడిపించిన కథ, మొత్తానికి ఒక నిండు ప్రాణం బలి.

ఇది బంగారు తెలంగాణ అంటే ఇలా అణిచివేతలు, అన్యాయాలు, భూ కబ్జాలు, అవినీతి చేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం ఇలా చేస్తేనే తెరాస పార్టీలో ఉండడం ఇది తెరాస పార్టీ సిద్ధాంతం.

తెరాస పార్టీ ని నిలదీస్తే ఎవరైనా ఇలాగే బలి కావాల్సింది.

  • ఒక సర్పంచ్ చేస్తున్న అవినీతి, భూ కబ్జా ని సాక్షాలతో బయటపెట్టినందుకు బెదిరించి అయిన వినకపోతే ఎమ్మేల్యే మరియు ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జిల్లా కలెక్టర్ సహకారంతో తప్పుడు కేసులు పెట్టించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలకు ఏం సమాధానం చెబుతావు..
  • వచ్చే ఎన్నికల్లో గెలవలేవు అని తెలిసీ ఇప్పుడు నియోజకవర్గం లో ఎక్కడో ఒక చోట ఏమైనా జరిగితే వెళ్లి ఆర్థిక సహాయం అని ఇన్ని రోజులు నువ్వు దోచుకున్న ప్రజల డబ్బును తీసుకెళ్లి ఆర్థిక సహాయం చేస్తున్నావ్ ఇప్పుడు రామగౌడ్ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేస్తావు.
  • వారి కుటుంబానికి ఎలాంటి హామీ ఇస్తావు.
  • నెన్నెల మండలంలో ఎలా తిరుగుతావు…
  • మీ పార్టీ నాయకులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటావు..?
  • వెంటనే ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *