Site icon Polytricks.in

ఇండియాలో విలీనం కోరుతున్న పీవోకే ప్రజలు

పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pok)ప్రజలు తమ ప్రాంతాన్ని ఇండియాలో విలీనం చేయాలని కోరుతున్నారు. పీవోకేలోని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు భారత్ లో విలీనం కోరుతూ ర్యాలీలతో హోరెత్తించారు. పాక్ ప్రభుత్వం తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని..తాము పాక్ లో అంతర్భంగా ఉండలేమని చెప్పుకొచ్చారు.

కార్గిల్ రోడ్డును తెరిచి భారత్ లోని కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పరిధిలోని కార్గిల్ జిల్లాలో కలపాలని కోరుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గత రెండు వారాలుగా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నినాదాలు చేస్తున్నారు.

పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో అక్కడి పరిస్థితులు దుర్భరంగా మారాయి. ప్రజల జీవన పరిస్థితులు దిగజారాయి. నిత్యావసర సరకులు కూడా కొనుగోలు చేయలేని దుస్థితికి చేరాయి. ఆహార వస్తువులైన గోధుమల కోసం కొట్లాడుకోవాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో అక్కడి ప్రజలు పాకిస్థాన్ సర్కార్ పై అగ్రహంగా ఉన్నారు.

పీవోకేను ఎప్పటికైనా చేజిక్కించుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడో చెప్పారు. తగిన అనువైన సమయం కోసమే భారత సర్కారు వేచి చూస్తోంది. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతే, అక్కడి ప్రజల మద్దతుతో పీవోకేను సొంతం చేసుకోవడానికి అనుకూలతలు పెరుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Exit mobile version