Site icon Polytricks.in

ఆస్కార్ వేదిక మీద ‘నాటు నాటు’ పాట ప్రదర్శనకు అనుమతి!

అమోహం! అద్భుతం! చాలా అరుదయిన గౌరవం మన తెలుగు పాటకు దక్కబోతోంది. మార్చ్ 12 న లాస్ ఏంజిల్స్ లో జరగనున్న  95 వ  ఆస్కార్ అవార్డ్ ల ప్రధానోత్సవంలో కార్యక్రమం లో మన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా లోని ‘నాటు నాటు’ పాడేందుకు ఆస్కార్ కమిటీ  అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యిన విషయం మీకు తెలిసిదే.

ఇందులో భాగంగా ఎం ఎం కీరవాణి తో పాటు గాయకులు కాలభైరవా, రాహుల్ కూడా పాల్గొనున్నారు. మొత్తం ఐదు పాటలు నామినేటేడ్ అయ్యాయి. అందులో ఈ పాటకు గట్టి పోటీగా ‘ఎవరీ థింగ్ ఎవరీ వేర్ అల్ ఎట్ వన్స్’ , ‘దిస్ ఇస్ ఏ లైఫ్’, ‘టేక్ ఇట్ లైయిక్ ఏ ఉమెన్’, ‘బ్లాకు పాంత్ వాకాండ ఫర్ ఎవర్’ పాటలు పోటిలో ఉన్నాయి.

అయితే సంగీత నిపుణులు చెప్పే దానిని బట్టి చూస్తే ‘బ్లాకు పాంత్ వాకాండ ఫర్ ఎవర్’ పాట మన పాటకు గట్టి పోటి ఇస్తోంది. అయితే ఇక్కడో చిన్న చిక్కుముడి ఉన్నది. తెలుగు సినిమాను సబ్ టైటిల్స్ తో ఇంగ్లిష్ వాళ్ళకు అర్థం చేయించ వచ్చు. కానీ పాటను లైవ్ లో ఎలా సబ్ టైటిల్స్ తో అర్థం చేయిస్తారో చూడాలి. సామాన్యంగా ఒకవైపు పాట వస్తుంటే మరో వైపు తెర మీద ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ వస్తాయి. దీనిని వాళ్ళు అర్థం చేసుకోవడం వేరు, ఎంజాయ్ చేయడం వేరు. మరి వాళ్ళు మన పాటను  విని ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలి. పలు అవార్డు లు పొందిన ఈ పాటకే ఆస్కార్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సంగీత నిపుణులు చెపుతున్నారు. అల్ ది బెస్ట్ కీరవాణి.
౦౦౦

Exit mobile version