Site icon Polytricks.in

వెలుగులోకి వచ్చిన ఈటల పాపాల చిట్టా పెన్ డ్రైవ్?

అవినీతికి పేటెంట్ రైట్స్ కొనుక్కున ఈటల రాజేందర్ ని సొంతపార్టీ బిఆర్ఎస్ మంత్రి పదవి నుంచి తప్పించి, పార్టీ లోంచి గెంటేసిన విషయం తెలిసిందే. దుష్టుడో, దుర్మార్గుడో తమ పార్టీలో చేరితే చాలు అనుకునే బిజెపి అతనికి ఆశ్రయం కల్పించింది. కానీ కాంగ్రెస్ మాత్రం అతను చేసిన అవినీతి మీద సరైన దర్యాప్తు చేయించి, అతని అక్రమల మీద తగిన ఆధారాలు సంపాదించి మొదటిసారి చార్జ్ షీట్ విడులచేసింది.

ఈ చార్జ్ షీట్ ప్రకారం అతను రెండు ఎకరాల సంపద నుంచి వంద ఎకరాలు ఎలా సంపాదించాడో వివరిచి, మొత్తం తొమ్మిది ఆరోపణలను కాంగ్రెస్  సంధించింది. ఇందులో ప్రధానమైనది, అతను పౌర సరఫరాల శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ బియ్యాన్ని ప్రైవేట్ కంపనిలకు అమ్మిన స్కాం బయటపెట్టింది. దోచుకున్న ఆ కోట్లాది రూపాయలతో ఆర్ వి ఎం మెడికల్ కాలేజ్ ఎలా కట్టాడో వివరించింది. కొన్ని కెమికల్ కంపెనీలను బలవంతంగా లాక్కుని, అందులో బీర్ ల ఉత్పత్తి కేంద్రాలుగా ఎలా మార్చారో ఆధారాలతో సహా వివరించింది.

ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన పౌల్ట్రీ లోంచి కోడి గుడ్లను గవర్నమెంట్ హాస్టళ్లకు ఎక్కువ ధరకు అమ్మిన స్కాం ఆధారాలు కూడా చూపింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్యాస్ ప్లాంట్ లు, జాతీయ రహదారి పనులల్లో భారీగా  ముడుపులు తీసుకున్నట్లు ఆరోపించారు. అసైన్డ్ భూములు, దేవాలయాల భూములు కూడా ఎలా ఆక్రమించాడో  వివరించింది. అక్కడి భూములు కోల్పోయిన పేద రైతుల స్టేట్ మెంట్ లు రికార్డ్ చేసింది.

అయితే ఇందులో బిఆర్ఎస్ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లు వివరించింది. ఇప్పుడు తనను  తాను చట్టం నుంచి రక్షించు కోడానికి మాత్రమే హుజురాబాద్లో కోట్లాది రూపాయలు పంచి ఏమ్మెల్లె గా గెలిచి బిజెపి చంక ఎక్కాడు అని ఆరోపించింది. నిన్నటివరకు అతనిని బిఆర్ఎస్ కాపాడుకుంది. నేడు బిజెపి  కాపాడుతోంది. ఈ రెండు పార్టీలు అవినీతిని పెంచి పోషిస్తున్నాయి అని ఆరోపించింది.

అవినీతి అనేది పులి మీద చేసే సవారి లాంటిది. ప్రయాణం సాగిపోతూనే ఉండాలి. దిగితే ఆ పులి చంపుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఏదో ఒక పార్టీ అందదంగాలు ఉండాలి. లేదా జైలు జీవితం తప్పాదు.

Exit mobile version