Site icon Polytricks.in

పవన్ కళ్యాణ్ కాపాడుకున్న ఆ చిన్నారి ఇకలేదు – కంటతడి పెట్టిస్తోన్న వీడియో

సరిగ్గా నాలుగేళ్ళ కిందట వైజాగ్ పర్యటనలో ఓ పాపను కలిశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కండరాల బలహీనతతో బాధపడుతోన్న ఆ పాపను బతికించుకోవడం ఆ తల్లిదండ్రులకు కష్టంగా మారింది. పవన్ కళ్యాణ్ ను అమితంగా ఇష్టపడే ఆ పాప గురించి తెలుసుకొని పరామర్శించాడు జనసేనాని.

పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఆరోగ్యం ఎలా ఉందని అడిగగా..నా హీరో మీరు సార్. మీ కాళ్ళను మొక్కవచ్చా అని పవన్ ను అడగడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పటి నుంచి ఆ పాప వైద్య ఖర్చులను మొత్తం తనే భరిస్తానని హామీ ఇచ్చాడు పవన్. పాప బ్రతకాలంటే రోజూ ఫిజియోతెరఫీ చేయల్సి ఉంటుంది కాబట్టి ఆ ఖర్చులను మొత్తం నాలుగేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ భరిస్తున్నారు.

అయితే, తాజాగా చికిత్స పొందుతూ ఆ పాప కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో చింతిస్తున్నారు.గతం లో పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి తో ప్రేమగా మాట్లాడిన మాటలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Exit mobile version