Site icon Polytricks.in

పదో తరగతి కుర్రాడిని లేపుకుపోయిన పంతులమ్మా?

గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి పిల్లలకు పాటలు చెపుతున్న పంతులమ్మ (26 ఏళ్ళు) కనిపించకుండా ఫెబ్రవరి 16 రోజు మాయమయ్యింది. ఆమె తాతయ్య ఆందోళన చెంది చందానగర్ పోలులకు పిర్యాదు చేశాడు. పోలీసులు తమ పద్దతిలో పరిశోధన చేస్తున్నారు.

అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి (15 ఏళ్ళు) కూడా కంపించలేదు. ఆ కుర్రాడి తల్లిదండ్రులు అదే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీస్ లకు అనుమాన వచ్చింది కొత్తకోణంలో కేసు దర్యప్తు చేశారు.

కానీ రెండు రోజుల తర్వాత కుర్రాడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వచ్చి తాము పెట్టిన కేసుని వెనక్కి తీసుకున్నారు. అలాగే ఆ పంతులమ్మ తాతయ్య కూడా ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి తాను పెట్టిన   ఆ కేస్నుని వెనక్కు తీసుకున్నాడు.

పోలీసులకు అప్పుడు నిజం తెలిసి షాకయ్యారు. ఆ పంతులమ్మ ఆ కుర్రాడిని తెగ ప్రేమించింది. ఆ సంగతి ఆమె తాతయ్యకు తెలిసి ఆమెను కోపడ్డాడు. వెంటనే పెళ్లి సంబధాలు చూడసాగాడు. ఆమెకు ఆ పెళ్లి ఇష్టం లేదు.

అందుకే ఆ కుర్రాడు తన విద్యార్ధి అని చూడకుండా, వయసులో దాదాపు పదేళ్ళు చిన్నవాడని చూడకుండా ఫెబ్రవరి 16న మంచి ముహూర్తం చూసి లేపుకు పోయింది. చివరికి ఆ కుర్రాడిని పెళ్లి చేసుకోబోయింది. కానీ మైనారిటీ తీరని ఆ కుర్రాడితో పెళ్లి చేయనని పురోహితుడి హితవు చెప్పేసరికి, ఆమె తిరుగు టపాలో ఆ కుర్రాడితో వెనక్కి వచ్చింది. అదండీ విషయం!

Exit mobile version