Site icon Polytricks.in

ప్రధానికి జలక్ ఇచ్చిన ఉల్లి రైతులు

ప్రధాన మంత్రి ఎవరి సలహా పాటించారో తెలియదు. కానీ ఆయన ఉల్లిని ఎగుమతిని ఒక్కసారిగా  ఆపేశారు. అందుకే ఒక్కసారిగా పడిపోయిన ఉల్లి ధరను పెంచాలని మహారాష్ట్ర లోని హేమాద్ నగర్ మార్కెట్ ఉల్లి రైతులు మోడి కి పోస్టులో కుళ్ళిపోయిన ఉల్లిపాయలు పంపుతున్నారు. ఇప్పుడు ప్రధాని కార్యాలయం మొత్తం ఉల్లిపాయల గోదాములా మారింది. అందులో బాంబులు ఉండవచ్చని ప్రధాని రక్షక సిబ్బంది హడలి చస్తున్నారు. ఇప్పుడు ఉల్లి రైతుల కన్నెర్ర చేశారు.

ఉల్లితో పాటు, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులను మోడి సర్కార్ ఎగుమతులు చేయరాదని దారుణంగా ఆదేశించింది. విదేశాల్లో అంతర్జాతీయ ధరకు అమ్మితే కానీ రైతులకు గిట్టుబాటు ధర రాదు. చాలా రోజులుగా పండించిన పంట గోదాములల్లో కుళ్ళిపోతోంది. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు సరికదా, చేసిన అప్పుల మీద వడ్డీ కూడా రావడం లేదు. ఒక్కైపు పెరిగిన క్రిమిసంహారక మందుల ధరలు, బ్యాంకు వడ్డీలు, అప్పుల భారంతో రైతులు సతమతమవుతున్నారు. దీనికి తోడూ ఎగుమరులను నిషేదాన్ని ఇప్పటిలో ఎత్తేసేలా లేరు మోడి.

ఈ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని రైతులు వినూత్న పద్దతిలో తమ నిరసన మోడి తెలియ జేస్తు మురిగి పోతున్న ఉల్లిని పోస్ట్ లో టన్నుల కొద్ది మోడికి బహుమతిగా వరసపెట్టి రోజు పంపుతున్నారు. ఆయనకు రాసిన ఉత్తరాలల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎగుమతుల మీది నిషేదాన్ని ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిషేధాన్ని ఎత్తేస్తే అంతర్జాతీయ మార్కెట్ కు ఉల్లిని పంపడానికి అవకాశం ఉంటుందని ఉల్లి రైతులు చెబుతున్నారు. అలాగే గత ఏడాది ఉత్పత్తులను విక్రయించిన రైతులకు పరిహారంగా క్వింటాల్కు రూ. 1000 ఇవ్వాలని ఉల్లి రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని మరో డిమాండ్  చేస్తున్నారు.

మహారాష్ట్రలో నాసిక్ లోని అతిపెద్ద హోల్ సేల్ ఉల్లి మార్కెట్ లాసల్ గావ్ లో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్దది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. ధర పడిపోవడంతో ఉల్లి సాగుదారులు సంక్షోభంలో చిక్కుకున్నారు. ఇక్కడ ఈ రోజు జరిగిన ఓ సమావేశంలో రెండు మూడు రోజులల్లో ప్రధాని నుంచి సానుకూల స్పందన రాకపోతే, దేశ వ్యాప్తంగా సరపరా చేస్తున్న ఉల్లిని నిలిపేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే దేశ వ్యాప్తంగా ఉల్లి ధర పోటేక్కడం ఖాయం. ఎందుకంటే వీళ్ళు ఇలా సరఫరా నిలిపివేసిన ప్రతిసారి దేశంలో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి.

Exit mobile version