Site icon Polytricks.in

థాంక్యూ సోమచ్ మావయ్యా : చంద్రబాబుకు ఎన్టీఆర్ రిప్లై

ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లభించడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు “ఆర్ఆర్ఆర్” మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఉదయం మూవీ యూనిట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు.

థాంక్యూ సోమచ్ మావయ్యా అంటూ చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు ఎన్టీఆర్. ప్రధానమంత్రి మోడీ, ఏపీ సీఎం జగన్ లు కూడా ఆర్ఆర్ఆర్ మూవీ టీంకు విషెస్ చెప్పగా వారికి కూడా ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. సీఎం జగన్‌కు ధ్యాంక్యూ సార్ అని రిప్లై ఇవ్వగా..ప్రధాని మోదీకి కూడా అదే విధంగా స్పందించి.. రీట్వీట్ చేశారు.

జగన్, మోదీలు ఆర్ఆర్ఆర్ కు అవార్డు వచ్చిన విషయాన్ని చెబుతూ చేసిన ట్వీట్‌లో ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశారు. చంద్రబాబు చేసిన ట్వీట్‌లో మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ ట్యాగ్ చేయలేదు. కీరవాణితో పాటు రాజమౌళిని మాత్రమే ట్యాగ్ చేశారు. అయినప్పటికీ ఎన్టీఆర్ స్పందించారు.

చంద్రబాబు బర్త్ డే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు విషెస్ చెప్పకపోవడం హాట్ టాపిక్ అయింది. నందమూరి , నారా వారి కుటుంబాల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయని అందుకే ఎన్టీఆర్ చంద్రబాబుకు విషెస్ చెప్పలేదనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు ట్వీట్ కు స్పందిస్తూ ఎన్టీఆర్ బందుత్వాన్ని కలుపుతూ థ్యాంక్యూ సోమచ్ మావయ్యా అంటూ రిప్లై ఇవ్వడంతో.. గతంలో జరిగిన ప్రచారమంతా ఉత్తిదేనని తేలింది.

Also Read : ఏపీ మంత్రి కొత్త దందా – కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Exit mobile version